మొదటి ప్రపంచ యుద్ధం
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో బ్రిటిషు వారు భారత దేశంలో తిరుగుబాటును శంకించారు. వారిని ఆశ్చర్యపరుస్తూ భారతదేశంలోని ముఖ్య నాయకులందరూ బ్రిటిషు వారికి అపూర్వమైన సహాయ సహకారాలనందించారు. మానవ, మానవేతర వనరులను సమకూర్చి భారత్ బ్రిటిషు యుధ్ధ ప్రయత్నానికి కొడంత అండగా నిలిచింది. సుమారు 13 లక్షల మంది భారతీయులు సైనికులుగానో, పనివారలగానో ఐరోపా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యాలలో పనిచేశారు. భారత ప్రభుత్వము, అప్పటి రాజవంశాలు పెద్ద ఎత్తున భోజన వస్తువులను, ధనాన్ని, మందుగుండు సామగ్రిని అందజేశాయి. కాని పంజాబు, బెంగాలులలో బ్రిటిషు వ్యతిరేకాగ్ని రగులుతూనే ఉంది. బెంగాలు జాతీయ వాదం, పంజాబులో అశాంతి చేతిలో చేయిగా స్థానిక పరిపాలనను స్థంభింపజేశాయి. యుధ్ధ ప్రారంభం నుండి ప్రవాసభారతీయులు, ముఖ్యంగా అమెరికా, కెనడా మరియూ జర్మనీలలో ఉన్నవారు, బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశంలో ఐరిష్ రిపబ్లిక్, జర్మనీ మరియు టర్కీల సహాయంతో 1857 తరహా తిరుగుబాటు జరుప తలపెట్టిన భారీ ప్రయత్నం హిందూ-జర్మన్ కుట్రగా పేరొందింది. ఈ కుట్రలో భాగంగా ఆఫ్ఘనిస్థానును కూడా బ్రిటిషు భారత్ పై ఉసిగొల్ప ప్రయత్నం జరిగింది. తిరుగుబాట్లకు జరిగిన అనేక ప్రయత్నాలలో ఫిబ్రవరి తిరుగుబాటు, సింగపూరు తిరుగుబాటు ముఖ్యమైనవి. ఈ ప్రయత్నాలన్నీ గట్టి అంతర్జాతీయ గూఢచర్యంతోనూ, కౄరమైన చట్టాల (భారత రక్షణ చట్టం 1915సహా)తోనూ పది సంవత్సరాలపాటు అణచివేయబడ్డయి.
మొదటి ప్రపంచ యుధ్ధానంతరం, యుధ్ధంలో జరిగిన భారీ ప్రాణనష్తం, పెరిగిన పన్నులతో మరింత పెరిగిన ద్రవ్యోల్బణం, సర్వవ్యాపకమైన ఫ్లూ మహమ్మారి, మందగించిన వ్యాపారాలు భారత ప్రజల బ్రతుకులను మరింత కష్టతరం చేసాయి. బ్రిటిష్ పాలననంతమొందిచడానికి భారత సైనికులు దేశంలోకి ఆయుధాలను దొంగతనంగా తెచ్చారు. కాంగ్రెసు లోని మితవాద, అతివాద గుంపులు మరల కలసి పనిచేయడంతో యుధ్ధపూర్వ జాతీయవాదం పునర్జీవితమైంది. 1916లో రాజకీయాధికారాల పంపిణీ, దేశంలో ఇస్లాం భవితవ్యాలపై కాంగ్రెసు, ముస్లిం లీగ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనికి లక్నో ఒప్పందం అని పేరు.
బ్రిటిషర్లు మొదటి ప్రపంచ యుద్ధంలోభారత దేశ సహాయానికి ప్రతిఫలంగా భారత జాతీయవాద కోర్కెలపై చూద్దాం,చేద్దాం పద్ధతినే అవలంబించారు. 1917 ఆగస్టులో భారత ప్రభుత్వ కార్యదర్శి అయినఎడ్విన్ శామ్యూల్ మోంటగు, భారత చట్టసభలో ఈ క్రింది ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు. "భారత దేశంపై ఆంగ్లేయుల దృక్పథం ఏమిటంటే ప్రతి నిర్వహణా శాఖలోనూ భారతీయుల సంఖ్యను, ప్రాముఖ్యతనూ పెంచుతూ, స్వయం నిర్వహణా వ్యవస్థలని క్రమంగా అభివృద్ధి చేసి ఒక అభివృద్ధి కాముకమైన ప్రభుత్వాన్ని భారత దేశంలో ఏర్పాటుచేసి,ఈ దేశాన్ని బ్రిటిష్ సార్వభౌమాధికార సామ్రజ్యంలోని అవిభాజ్య భాగంగా తయారు చెయ్యడం". ఈ కలని సాకారంచేసే ప్రయత్నం భారత్ ప్రభుత్వ చట్టం1919 లోకనిపించింది.ఆ చట్టం ద్వంద నిర్వహణా విధానాన్నిప్రవేశపెట్టింది. దీంట్లో భారతదేశం నుండి ఎన్నుకోబడిన శాసనకర్తలు, బ్రిటీషు ప్రభుత్వం నియమించిన అధికారులు అధికారాన్నిపంచుకుంటారు. ఈ చట్టం కేంద్రీయ, ప్రాంతీయ శాసనసభలనీ, వోటు హక్కునీ విస్తృత పరచింది. ద్వంద నిర్వహణా విధానం అమలు కాగానే ప్రాంతీయ పరిధిలో అనేక మార్పులు వచ్చాయి.అనేకమైన అవివాదాస్పద మంత్రిత్వ శాఖలు, వ్యవసాయం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఆరోగ్యం, విద్య, ప్రజా పనులు లాంటివి భారతీయులకి ఒప్పచెప్పి, సున్నితమైన ఆర్ధిక శాఖ, పన్నులు, శాంతి భద్రతలు మాత్రం ప్రాంతీయ బ్రిటీషు నిర్వాహకులు అట్టిపెట్టుకున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం
ReplyDelete