Breaking News

మహిళలకు అండాదండ ఉన్నవ లక్ష్మీబాయమ్మ



వయోజనులైన స్త్రీలకు తీరికవేళల్లో విద్యాబోధన చేయటమేకాక వితంతువుల కోసం ఒక శరణాలయాన్ని నడిపిన మహి ళామణిపూస ఉన్నవ లక్ష్మీ బాయమ్మ. నడింపల్లి సీతా రామయ్య రామలక్ష్మమ్మ దం పతులకు 1882లో గుం టూరు జిల్లా సత్తెనపల్లి తాలూ కాలోని అమీనాబాద్‌ గ్రామం లో ఈమె జన్మించారు. తన 10వ ఏట గుంటూరుజిల్లా వేములూరిపాడుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో వివాహం జరిగింది.

ఆయన అత్యంత శాంతమూర్తి. సరళ స్వభావి. బారిష్టరు చదవ టానికి లక్ష్మీనా రాయణ ఇంగ్లండు వెళ్ళాడు . గాంధీజీలా సంస్కారభావాలు అలవరచుకు న్నారు. సమాజ పతనానికి మూలకారణాలు వెతకటం, రచనాత్మక కార్యకలాపా లను నిర్వహించటం వంటి ఉన్నత భావా లను లకీనారాయణ పెంపొందించుకు న్నారు. తన సహధర్మచారిణి, లకీబాయమ్మ సహాయ సహకారాలు లేనిదే ఏపని సానుకూలం కాదని ఆయన ప్రగాఢ విశ్వాసం అందువల్లే భార్యలో విజ్ఞాన తృష్ణ పెంచారు. సంస్కార భావాలు అలవరచారు.1902లో ఉన్నవ దంపతులు గుంటూరుజిల్లాలో ఒక వితంతు శరణాలయం స్థాపించారు. ఎంతో సాహసంతో వితంతు పునర్వివివాహాలు జరిపించారు. ఇంత లో రాజమండ్రి నుండి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ దంపతుల్ని పిలిచారు.

వీరేశలింగం అక్కడ స్థాపించిన ఆశ్రమం, శరణాలయ కార్యకలాపాల ను ఈ దంపతులకు చూపించారు. అక్కడి వారంతా కలసి ఆశ్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వీరు పరిశీలించారు. ఎంతో అనుభవాన్ని గడిం చారు. ఆ మీదట 1908లో ఉన్నవ దంపతులు గుంటూరు తిరిగి వచ్చారు. 1914నుండి స్వాతంత్య్రం సంపాదించు కోవాలనే ఆకాంక్ష భారతీయుల్లో బలంగా నాటుకు పోయింది. ఉన్నవ దంపతులతోపాటు అయ్యదేవర కాళేశ్వరరావు, రాయప్రోలు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వంటి మహనీయులెందరరో తరచూ పోట్లపూడిలో సమావేశమౌతుం డేవారు. స్వరాజ్య సంపాదన గురించి ఆంధ్రరాష్ర్ట నిర్మాణానికై ఆలోచనలు జరిపేవారు. బాలగంగాధర తిలక్‌ ఆనాటి రాజకీయగురువు.

వయోజనులైన స్త్రీలకు తీరిక సమయాలలో విద్యాబోధన, చేతిపనులు నేర్పేందుకు ఒక పాఠశాలను నెలకొల్పారు.1918లో దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి ఇంట్లోనే ఈ పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాల కాలక్రమంలో శార దా నికేతన్‌గా రూపొందినది. ఆ తరువాత 1921 నాటికి గాంధీజీ నాయకత్వం వచ్చింది. కాం గ్రెస్‌ సంఘం ఏర్పడింది. ఒక క్రమపద్ధతిలో ఉద్యమ నిర్వాహణ కొనసాగించ సాగారు. అప్పట్లో పల్నాటి ప్రజలు అటవీ సంపదను పన్నులు చెల్లించ వద్దని కాంగ్రెస్‌ అప్పటికింకా చెప్పలేదు. ఈ విషయాన్ని పరిశీలించమని కాంగ్రెసు సంఘం వారు లకీనారాయణతోపాటు మాడభూషి వేదాంత నరసింహాచార్యుల్ని పంపించారు.

వీళ్ళే ఉద్యమాన్ని రగిలిస్తున్నారని అప్పటి ప్రభుత్వం భ్రమపడి వీరిని నిర్భంధించింది. లకీబాయమ్మ తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో స్త్రీలు, విద్యా ర్థులను ఆకట్టుకునేవారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన పిదప భారతప్రభుత్వం అదే పుస్తకాన్ని బి.ఏ.తరగతులతో పాటు, రాష్ర్టభాషా విశారద పరీక్షలకు పాఠ్యగ్రంథంగా ఉంచారు. జాతీయ విధానంలో స్త్రీవిద్య వ్యాప్తి చేయాలని 1922లో ఉన్నవ దంపతులు భావించారు. తెలుగు, సంస్కృత భాషలకు ప్రాధాన్యతనిస్తూ విద్వాన్‌, భాషాప్రవీణ పరీక్షలకు శారదానికేతన్‌లో తరగతులు నడిపారు. విదేశీవస్త్ర, వస్తు బహిష్కరణకు లకీబాయమ్మ పిలుపునిచ్చారు. సంస్థకు చెందిన బాలికలతో పాటు వీరుకూడా నూలు వడికి ఖాదీని ధరించేవారు.

1930లో జరిగిన ఉప సత్యాగ్రహం భారతీయులందరినీ ఏకత్రాటిపై నిలిచేలా చేసింది. ఆమె వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనగా 2-2-1941న మూడవసారి అరెస్టుచేసి మూడునెలల శిక్ష నిమిత్తం రాయవేలూరు జైలుకు పంపారు. దేశసేవిక, సంస్కారిణి అయిన ఉన్నవ లకీబాయమ్మ తన 70వ ఏట 1952లో ముత్తయిదువుగా పుణ్యలోకాలకు తరలిపోయారు. ఆ మాతృమూర్తి సేవలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకుని వారు చూపిన బాటలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

No comments