Breaking News

భారతీయ ప్రతిభ


భారతీయులకు మనమంతా ఎంతో ఋణపడి ఉన్నాం. ఎందుకంటే వారేమనకు లెక్కించటం అంటే ఏమిటో నేర్పారు. అదే వారు నేర్పియుండక పోతే, ప్రపంచంలో ఉపయోగకరమైన ఏ శాస్త్రీయ విషయమూ కనుగొనడం సాధ్యపదివుందేదికాడు. - ఆల్బర్ట్ ఐనిస్టీన్

భారతదేశం మానవజాతికే మూలస్థానం. మానవభాషకి పుట్టినిల్లు. చరిత్రకు తల్లి, పురాణాలకు అమ్మమ్మ. సంప్రదాయానికి తాతమ్మ. ప్రపంచంలో మానవజాతికి అతివిలువైన, మార్గదర్శకమైనదంతా భారతదేశంలోనే కొలువుచేసివుంది. - ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేన్ 

మానవమనుగడ యొక్క ప్రారంభదశ నుండీ, ఈ లోకంలో మానవుల సర్వ ఆదర్శాలకూ, స్వప్నాలకూ ఆటపట్టైన ప్రదేశం ఏమన్నా వుందా అంటే, అది భారతదేశమే. - ప్రఖ్యాత ఫ్రెంచి విద్వాంసుడు, రొమైన్ రోలాండ్

ఇన్ని సంవత్సరాల చరిత్రలో భారతదేశం ఏ విదేశంపైనా ఒక్క ఆక్రమణ కూడా జరపలేదు.

సర్వ ఐరొపాభాషలకీ కూడా మాతృక సంస్కృత భాషయే.

ఈ అత్యాధునిక ప్రపంచంలో కూడా కంప్యూటర్ (సాఫ్టవేర్) భాషగా అన్నిటికంటే బాగా సరిపోయేది కూడా సంస్కృత మేనని ఫోర్బ్స్ పత్రిక ఇంతకుముందే ప్రకటించింది.

క్రి.శ. 5వ శతాబ్దానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు, భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగేందుకు పట్టేకాలాన్ని (సంవత్సరం) ఖచ్చితంగా లెక్కగట్టాడు. అది-365.258756484 రోజులు.

చదరంగం క్రీడ (అష్టపాద) కూడా భారతదేశంలోనే జన్మించింది.

ప్రపంచానికి లెక్కలు తెలియని రోజుల్లోనే భారతదేశంలో అంకగణితం (Arithmetic). బీజ గణితం (Algebra). రేఖ గణితం (Geometry). త్రికోణమితి (Trigonometry) తదితర విభాగాలతో గణితశాస్త్రం అగ్రస్థానంలో ఉంది.

ప్రపంచానికి శూన్యం (సున్నా) అందించింది. భారతదేశమే సున్నా గురించి తెలుసుకున్న తరువాత ప్రపంచంలో గణిత విజ్ఞానం అభివృద్ధి చెందింది.
క్రీస్తుపూర్వం రోమన్ల గణనం 10^3 వరకు, గ్రీకుల గణనం 10^4 వరకు మాత్రమే పరిమితమై ఉండేది. అప్పుడు భారతీయులు 10^53 దాకా గణించేవారు.

బ్రిటీష్ వారి దాడికి ముందు అంటే 17 వ శతాబ్ధపు ప్రారంభం వరకూ భారతదేశం ప్రపంచంలోని ఎక్కువ ఐశ్వర్యం గల దేశాలలో ఒకటి.

ఎక్కువ మసీదులున్న దేశం భారతదేశం. భారతదేశంలో 3,00,000 మసీదులున్నాయి. ముస్లీం ప్రపంచం మొత్తం మీద ఇన్ని మసీదులు లేవు.

ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఎగుమతిలో ఇండియా నెంబర్ ఒన్.

1986 ముందు వరకు ఒక్క భారతదేశంలో మాత్రమే డైమండ్లు కనబడేవి.

సెటిలైట్లను అంతరిక్షంలోకి పంపే దేశాలలో ఇండియా 6 వ స్థానం.

చక్కెర ను మొదట వాడింది భారతదేశం

నాకు తెలిసినవి, నేను చదివినవి మీకోసం ఇక్కడ ప్రచురించాను. మీకు ఇంకా తెలిసినవి ఉంటే క్రింద కామెంట్ రూపంలో ప్రచురించండి. 

జై హింద్..

- సాయినాద్ రెడ్డి

2 comments: