Breaking News

బిపిన్‌ చంద్రపాల్‌

జననం: నవంబర్ 7, 1858
మరణం: మే 20, 1932


భారతదేశాన్ని బ్రిటిష్‌ వారి ఆరాచకపాలను నుంచి తప్పించి స్వాతంత్య్రాన్ని తీసుకురావడినికి కృషి చేసిన వారిలో ప్రముఖులు బిపిన్‌ చంద్రపాల్‌. దేశ భక్తి భావాలను ప్రజలలో రేెకత్తిం చడానికి ఆయన తన పత్రిేకయ వృత్తి ఎంతగానో ఉపయో గపడింది. అంతే కాకుండా ఆయన మంచి వాగ్ధాటి గల వక్త కూడా. బిపిన్‌ చంద్రపాల్‌ 1858 నవంబర్‌ 7న సిల్హెట్‌లో కాయస్తా కుటుంబంలో జన్మించారు.

బిపిన్‌ చంద్రపాల్‌ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడానికి ఆయన కలత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరినా కొన్ని అనుకోని కారణాలవల్ల కోర్సును పూర్తి చేయలేదు. తన విద్యాభ్యాసాన్ని ఒక విద్యా సంస్థకు హెడ్‌ మాస్టర్‌గా చేరి పూర్తి చేశారు. ఒక లైబ్రేరియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బిపిన్‌ ఆ సమయంలో చాలా మంది రాజకీయ నాయకులను కలిసేవారు. అందులో శివనాథ్‌ శాస్ర్తీ, బేనర్జీ, బి.కె. గోస్వామీ వంటి ప్రముఖలు కూడా ఉన్నారు.ఆ ఉద్యోగాన్ని విడిచి రాజకీయంలో చేరారు. తరువాత కాలంలో ఆయన తిలక్‌, లాలా లజపత్‌రాయ్‌, అరబిందో వంటి ప్రముఖలు రచించిన తత్త్వ శాస్త్ర (ఫిలాసఫీ) పుస్తకాలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి.

వీరి భావాలు బిపిన్‌పై ఎంతగా ప్రభావితం చేశాయంటే ఆయన రాజకీయాన్ని విడిచి స్వాతంత్య్రోద్యంలో భాగం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ముందు ఆయన 1898లో ఆయన ఇంగ్లాండ్‌ వెళ్లి కంపారేటివ్‌ ఐడియాలజీ కోర్సును పూర్తి చేసి ఒక సంవత్సరం తరువాత భారతదేశానికి వచ్చారు. వచ్చిరాగానే ఆయన భారతీయులలో స్వరాజ్య కాంక్షను రేకెత్తించేందుకు అనేక సభలను సామావేశాలను నిర్వహించారు. వక్తగా తన మాటల్తో, జర్నలిస్ట్‌గా తన రాతల్తో దేశాభిమానాన్ని భారతీయుల్లో నూరి పోయడంతో పాటు మానవత్వం, సామజిక చేతన్యం గురించి కూడా ఎంతో చేశారు.

ఉద్యమాలలో

బిపిన్‌ చంద్రపాల్‌ 1904లో జరిగిన బాంబే జాతీయ కాంగ్రెస్‌ సెషన్‌, 1905 బెంగాల్‌ విభజ న,1923 సహాయ నిరాకరణో ద్యమంలో పాల్గొన్నారు. 1932లో తుది శ్వాస విడిచిన బిపిన్‌ చంద్రపాల్‌ చివరి శ్వాస వరకు ప్రజల్లో స్వతంత్ర భారతావని కాంక్షను రగిలించగలిగారు.

No comments