Breaking News

పెద్దల ఉపన్యాసాలు భాషాంతరీకరణలు-హాస్యం

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఒక కిసాన్ సంఘటన ప్రారంభం చేస్తూ ఆ ఉత్సవం ఆచార్య కృపాలన్నీ గారితో ప్రారంభింప చేశారు. వారు ఆంగ్లం లో మాట్లాడితే పంతులు గారు తెలుగు లోకి భాష అంతరీకరణ చేయడానికి మరో మైక్ దగ్గరికి వచ్చారు.
కృపాలానీ గారు ఉపన్యాసం ప్రారంభం చేసి- Why I have initiated this organisation..అంటూ పంతులు గారి వైపు చూసారు. అప్పట్లో వాక్యం వాక్యం ట్రాన్సలెట్ చేసే వారు. పంతులుగారు గొంతు సవరించి, ఈ కిసాన్ సంఘ్ ని నేను ప్రారంభం చేసి ప్రారంభోత్సవానికి ఈ ముసలాయన్ని పిలిస్తే, ఏదో ఆయన మొదలెత్తినట్టు చెప్పుకుంటున్నారు. పోనీలే, ఈ సంస్థను నేను ఎందుకు ప్రారంభిం చానంటే.. అని వారి వైపు చూసారు.
అందరూ ఘొల్లున నవ్వారు. పాపం కృపాలానీ గారికి తెలుగు రాదు కదా! నేను ఒక్క మాట మాట్లాడితే వీరు ఇంత భాషాంతరీకరణ చేశారు. అందులో జోక్ ఏముంది? అందరూ నవ్వారు. ఇంతకీ ఈయన ఏమి చెప్పారో అనుకుంటూ అనుమానంగా పంతులు గారి వైపు చూసారు. Please continue Sir అన్నారు పంతులుగారు. పాపం వారు మిగతా వాక్యాలు పొడి పొడి గా పూర్తి చేశారు.
భాషఅంతరీకరణా జరిగింది.

మాననీయ హాలదేకర్జీ ప్రచారక్ గా వచ్చిన కొత్తలో సూర్యాపేట లో మాట్లాడడానికి వెళ్లారు. వారికి అప్పటికి తెలుగు రాదు. శాఖ లో హిందీ లో మాట్లాడారు. స్థానిక శ్రీ వెంకటరామిరెడ్డి గారు తెనింగించారు. వీరికి హిందీ రాదు. ఈ సంఘటన చెబుతూ ఆ రోజు స్వయంసేవకుల రెండు ఉపన్యాసాలు విన్నారు అని చెప్పితే విన్న వారంతా పడి పడి నవ్వారు.
మరో సంఘటన రేపు వ్రాస్తాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. పెద్దల ఉపన్యాసాలు భాషాంతరీకరణలు-హాస్యం

    ReplyDelete