Breaking News

జయ జయహే తెలంగాణ


జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం 
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం 
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం 
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
 జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 


పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ 
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ 
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప 
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 


జానపద జన జీవన జావళీలు జాలువార 
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర 
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి 
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం 
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ 
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ 
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి 
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి 
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జై జై తెలంగాణ!!


విన్నపం: మీ దగ్గర ఈ గీతం mp3 రూపంలో ఉంటే దయచేసి ఈ క్రింది మెయిల్ కు పంపండి.
meetsainadhreddy@gmail.com

22 comments:

  1. జయ జయహే తెలంగాణ.

    ReplyDelete
  2. Please upload the song. Jai telangana jai jai telangana..

    ReplyDelete
  3. Movement chesinappati song vundi YouTube lo kaani. Eppati marchina song dorakatle..

    ReplyDelete
  4. Could anyone please send the anthem. Or please give the link.

    ReplyDelete
  5. Anna paata nu net lo pedthey adi dwnld chesi ma school lo vinipinchi pillalto paadista. - Prakash High School, Suryapet.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా పెడతాను దొరికినవెంటనే. ధన్యవాదాలు సోదరా.

      Delete
  6. డొరకత్లెదు నెట్లొ

    ReplyDelete
  7. Jaya Jayate he telangana janani jayaketanam... I am searching this song. Please post it.

    ReplyDelete
  8. This song was written by Ande Sri. Excellent composition. Hattsoff to you ande sir

    ReplyDelete
  9. తెలంగాణ గీతం

    ReplyDelete
  10. Super blog with full of nationalist ideology

    ReplyDelete
  11. I too want that song

    ReplyDelete
  12. True Indian blood. Jai Hind

    ReplyDelete
  13. సాయినాధ్ గారూ, నేను మీ కోరిక మేరకు మీకు ఈపాటను ఈమెయిలు చేసాను.

    ReplyDelete
    Replies
    1. జై గారు. ఈ పాట స్వరాష్ట్రం కోసం వుద్యమించినప్పటిది. ప్రస్తుతం పాటలో చాలా మార్పులతో రాష్ట్ర గీతంగా మార్చారు. గమనించగలరు.
      స్పందించినందుకు ధన్యవాదాలు...

      జై హింద్

      Delete
  14. Till now there is no officials released song

    ReplyDelete
  15. వీడియో సాంగ్ ఉంది.

    ReplyDelete
    Replies
    1. పంపండి. పైన ఉన్న మెయిల్ కి.

      Delete
  16. ఈ పాట మీ దగ్గర ఉంటే నాకు ఈమెయిల్ చేయండి.

    ReplyDelete