Breaking News

మాన్యులు శివప్రసాద్ గారు ఇక‌ లేరు

మాన్యులు శ్రీ దెందుకూరి శివప్రసాద్ గారు ఈ రోజు స్వర్గస్తులయ్యారు. పూర్వాంధ్ర స్వయంసేవకులకు చిరపరిచితులు. నిరంతర పర్యటన చేస్తూ కార్యకర్తలతొ గరిష్ట సంబంధం కలిగిన‌ సీనియర్ కార్యకర్త. శ్రీ రాజేంద్ర, సంఘ ప్రచారకులు వారి గూర్చి రండు సంఘటనలు చెప్పారు. ‌మీరూ వినండి

ఒకసారి ఎలమంచిలి పర్యటన ముగించి  విశాఖ బయలుదేరుతూ బస్సు ఎక్కారట. స్థానిక స్వయంసేవక్ తనూ రేపు ఆంధ్రా యునివర్సిటీ వస్తాను. ఒక‌ యం ఎ సంస్కృతం‌ కి అప్లికేషన్ కొరకు అన్నారట. ఎందుకు నేను పంపిస్తానులే.  దానికోసం‌అంత దూరం‌ఎందుకు అని శివప్రసాద్ గారు అన్నారట.  వారు యూనివర్సిటీ లో లెక్చరర్.  ఏదో వారు అన్నారు. జ్ఞాపకం ఉంటందా? అనుకున్నారు.  కాని మూడవ రోజు పోస్టులో వచ్చింది.
స్వయంసేవకుల పనిని అంత శ్రద్ద గా పట్టించుకోవడం వారి నుండి నేర్చుకోవాలి అంటాడు, రాజేంద్ర.

ఒకరోజు శ్రీకాకుళం లో మాననీయ మజ్జి నరసింహం గారి ఇంట్లో భోజనం చేసి ఐదవ తరగతిచదివేవాళ్ల అమ్మాయి కి భారతం కథలో‌ కౌరవులు నూరు మంది అని చెబుతుంటే, ఆమె అడ్డువచ్చి వాళ్ళ పేర్లున్నాయా? అని అడిగిందట. ఇప్పుడు నేను చెప్పలేను ‌కాని, నీకు పంపిస్తాను అన్నారట. ‌అమ్మాయి సరే అంది.  విశాఖ వెళ్ళాక ఆ నూరు పేర్లు, చెల్లెలు దుస్సల పేరు కలిపి పెద్ద ఉత్తరం వ్రాసారట.  ఆమె ఇప్పుడు ఖరగ్పూర్లో ఉంటూంది.  ఆమె కొడుకు ఇదే ప్రశ్న వేస్తే ఆమె దాచుకున్న ఆ ఉత్తరం చూపి వాళ్ళ పేర్లు చెప్పిందట.  

సంఘం లో కార్యకర్తల కుటుంబాల మధ్య తర తరాలుగా సంబంధం కొనసాగడం అంటే ఇదే. మధుమేహం ఎక్కువయ్యి వారి దృష్టి మందగించి ఈ మధ్య పర్యటన ఆగింది.  వారు పర్యటించిన ప్రతీ ఊరు, అందులో స్వయంసేవకుల పేర్లు, వారి వివరాలు ఆలొచిస్తూ ఈ మధ్య మానసిక పర్యటన చేస్తూ తన 83 ,వ ఏట వారు హార్ట్ అటాక్ తో వారి స్వగృహం లొ ఉదయం _11.00 గంటలకు స్వర్గస్తు లయ్యారు. 

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. సంఘం లో కార్యకర్తల కుటుంబాల మధ్య తర తరాలుగా సంబంధం కొనసాగడం అంటే ఇదే.

    ReplyDelete