Breaking News

ఎవరికి హారతి ఇవ్వాలి - Yevariki Harathi Ivvali Song Lyrics in Telugu

 రచన - అప్పాల ప్రసాద్

ఎవరికి హారతి ఇవ్వాలి – నేనెవరికి హారతి ఇవ్వాలి 

అనంతమైన నీ మహిమలను – ఎలా వర్ణించి పాడాలి ? ఎలా వర్ణించి పాడాలి ?॥

1

బంగరు దీపం వెలిగించి – ఎన్ని హారతులు ఇచ్చినా

కోటి సూర్యుల కాంతులు – నీ మహిమలకే సరిపోదన్నా !

అగ్నిహోమం చేసినా – ఆడంబరంతొ అర్చించినా 

అంతరంగమున ఉన్న తత్త్వమును – ఎలా చేరగలము 

మేమెలా చేరగలము ॥

ఎవరికి హారతి ఇవ్వాలి – నేనెవరికి హారతి ఇవ్వాలి 

అనంతమైన నీ మహిమలను – ఎలా వర్ణించి  పాడాలి?

నేనెలా వర్ణించి పాడాలి ॥

2

పంచభూతముల  ప్రకృతి – ఈ జగమంతా నీ మాయ

మూడుగుణముల తెర వెనుక – దాగి ఉన్నది నీ మాయ

కనిపించేదే నీ రూపం – వినిపించేదే నీ నాదం

అంతట నీవె నిండియుండగా – 

ఎవరికి హారతి ఇవ్వాలి? 

నేనెవరికి హారతి ఇవ్వాలి ॥

ఎవరికి హారతి ఇవ్వాలి – నేనెవరికి హారతి ఇవ్వాలి 

అనంతమైన నీ మహిమలను – ఎలా వర్ణించి పాడాలి?

నేనెలా వర్ణించి పాడాలి ॥

3

విశ్వమంతా వెలిగిన కాంతులు

 నీ జ్యోతికి సరిపోవు 

లోకమంతా ఎంత వెదికినా 

 నిన్ను మించినది ఏదీ లేదు

గురు రవిదాసు దర్శించినది 

హృదయంలోని  జ్యోతి ఒక్కటే 

ఒకటే జ్యోతి – ఒకటే తత్త్వం 

అది పరమాత్ముని నిజ తేజం ॥

ఎవరికి హారతి ఇవ్వాలి – నేనెవరికి హారతి ఇవ్వాలి 

అనంతమైన నీ మహిమలను – ఎలా వర్ణించి పాడాలి?

నేనెలా వర్ణించి పాడాలి 

No comments