హారతి గైకొనుమా - Harath Gaikonuma Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
శ్రీ రామ నామం మదిలో నిలిపి
శ్రీ హరి నామం నిత్యం పలికి
మోక్షం పొందిన గురు రవిదాసా
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
నిర్మలమైన ప్రేమ స్వరూపి గురురవిదాసు కి హారతి
భక్తి శ్రద్ధలే మోక్షమార్గమని చూపిన గురువుకి హారతి
భగవన్నామం మహా ధనమని చాటిన గురువుకి
హారతి
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
శ్రీ రామ నామం మదిలో నిలిపి
శ్రీ హరి నామం నిత్యం పలికి
మోక్షం పొందిన గురు రవిదాసా
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
శాలగ్రామం విష్ణురూపమున కొలిచిన గురువుకి హారతి
నిరాకారము నిర్గుణ భక్తి చూపిన గురువుకి హారతి
సరళ జీవనం ధర్మాచరణం గురు రవిదాసుకి హారతి
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
శ్రీ రామ నామం మదిలో నిలిపి
శ్రీ హరి నామం నిత్యం పలికి
మోక్షం పొందిన గురు రవిదాసా
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
సరళ భక్తితో అంతర్యామిని దర్శించిన గురువుకి హారతి
విమల మనస్సుతొ దైవదర్శనం చేసిన గురువుకి హారతి
సమభావంతో సాధుసంతుల సేవించిన గురువుకి హారతి
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
శ్రీ రామ నామం మదిలో నిలిపి
శ్రీ హరి నామం నిత్యం పలికి
మోక్షం పొందిన గురు రవిదాసా
హారతి గైకొనుమా
మంగళ హారతి గైకొనుమా
No comments