Breaking News

హారతి జయ హారతి - Harathi Jaya Harathi Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


హారతి జయ హారతి 

పరబ్రహ్మకే హారతి 

అంతరంగమున వెలిగే జ్యోతికి 

నిరంతరం జయ హారతి 


1

నాదబిందువుల సంగమానికి 

దివ్యజ్యోతి హారతిగా

సుషుమ్నా మార్గమందు – 

అమృతజ్యోతి వెలగంగా

మనసును పుష్పముగా తలచి 

ప్రేమను మాలగా చేసి

త్రికూటి మధ్యన భవ్యంగా 

వెలిగే జ్యోతిని దర్శిద్దాం ॥


హారతి జయ హారతి 

పరబ్రహ్మకే హారతి 

అంతరంగమున వెలిగే జ్యోతికి 

నిరంతరం జయ హారతి 


2

అఖండమైన నెయ్యిధారతొ

జ్ఞానదీపమే వెలిగించి

చైతన్యమే వత్తిగా చేసి 

అంతరంగం ప్రకాశించగ 

రేయి పగలు తేడా లేక 

నిత్యం జ్యోతి  వెలగంగా

నా లోపల నీవున్నావని 

నాథా నిన్ను కొలిచెదము ॥


హారతి జయ హారతి 

పరబ్రహ్మకే హారతి 

అంతరంగమున వెలిగే జ్యోతికి 

నిరంతరం జయ హారతి 



3

ప్రాణవాయువే పళ్లెం కాగా – 

ధ్యానముద్రయే హారతికాగా

సూర్యచంద్రుల అఖండ కాంతి – 

హృదయమంతా నిండిపోవగా 

అనాహతం నాదమందు 

నీ నామమే వినిపించగా

గురురవిదాసు చూపిన దారిలో 

పరమపదము చేరెదము 


హారతి జయ హారతి 

పరబ్రహ్మకే హారతి 

అంతరంగమున వెలిగే జ్యోతికి 

నిరంతరం జయ హారతి 


4

బయటి దీపము వెలిగిస్తే – 

పూజకు ఆరంభం 

లోపలి జ్యోతిని వెలిగిస్తే –

హారతి నిజరూపం 

నిర్గుణమైన నిరాకారుని

పరమపురుషుని చేరుటకు

గురువు చూపిన మార్గమిది – 

గురు రవిదాసుకి హారతిది ॥


హారతి జయ హారతి 

పరబ్రహ్మకే హారతి 

అంతరంగమున వెలిగే జ్యోతికి 

నిరంతరం జయ హారతి

No comments