నామమే నీ హారతి - Namame Nee Harathi Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
నామమే నీ హారతి – హరి నామమే నీ హారతి
నామస్మరణం లేనిదే – జగమంత మాయే హారతి
నరహరి ఓ మురహరీ – భవ హరుడా నీకే హారతి ॥
1
నీ నామమే ఆసనం – నీ నామమే నిత్యపూజ
నీ నామమే చందనం – నీ నామమే సుగంధం
నీ నామమే తీర్థమై – నీ పాదములనె చేరగా
నరహరి ఓ మురహరీ – భవ హరుడా నీకే హారతి ॥
నామమే నీ హారతి – హరి నామమే నీ హారతి
నామస్మరణం లేనిదే – జగమంత మాయే హారతి
2
నీ నామమే దీపము – నీ నామమే వత్తిగా
నీ నామమే నూనెగా – వెలిగేను దివ్యజ్యోతిగా
అజ్ఞాన చీకటి అంతమై – లోకమంత ప్రకాశమే
నరహరి ఓ మురహరీ – భవ హరుడా నీకే హారతి ॥
నామమే నీ హారతి – హరి నామమే నీ హారతి
నామస్మరణం లేనిదే – జగమంత మాయే హారతి
3
నీ నామమే పూలమాల – నీ నామమే దారం
నీ నామమే పరిమళం – నీ నామమే సారము
గురు రవిదాసు హృదిలో – నామస్వరమే నిండగా
నరహరి ఓ మురహరీ – భవ హరుడా నీకే హారతి ॥
నామమే నీ హారతి – హరి నామమే నీ హారతి
నామస్మరణం లేనిదే – జగమంత మాయే హారతి
4
పద్నాలుగు లోకాలు – అరవై ఎనిమిది తీర్థాలు
సర్వజీవ రాశులన్నీ – నీ రూపమే శ్రీ హరీ!
సత్యనామం భోగమై – భక్తినే అర్పించితి
నరహరి ఓ మురహరీ – భవ హరుడ నీకే హారతి ॥
నామమే నీ హారతి – హరి నామమే నీ హారతి
నామస్మరణం లేనిదే – జగమంత మాయే హారతి
No comments