మనసే మందిరమై - Manase Mandiramai Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
మనసే మందిరమై – ప్రేమయే పుష్పాలై
రామా! నీ పాదాలకు – హారతి ఇస్తినయా
1
నా నాలుకతో నీ మహిమను – పలుకలేను నేను
నా గుండెల్లో వెలసిన నిన్ను – మాటలతో నే కొలవలేను
మనస్సనే మందిరమందు – దీపం భక్తి వెలిగించి
ప్రేమ మాలతో ఓ రామా! నిత్యం నిన్ను పూజిస్తా ॥
మనసే మందిరమై – ప్రేమయే పుష్పాలై
రామా! నీ పాదాలకు – హారతి ఇస్తినయా
2
నాలుగు దిక్కుల దీపాలై – నీ జ్యోతిని వెలిగిస్తా
ఒక దీపంతో మరియొక దీపం – వెలిగించి నిను దర్శిస్తా
సకల జీవిలో వెలుగుతున్న – ఆత్మజ్యోతివి నీవేనంటూ
తనువు మనసు ఆత్మతో – నీకే సేవలు సాగిస్తా ॥
మనసే మందిరమై – ప్రేమయే పుష్పాలై
రామా! నీ పాదాలకు – హారతి ఇస్తినయా
3
నిరంతరం శ్రీ హరినామం – నా హృదయంలో జపిస్తా
శరణాగతితొ నీ చరణముల – నా జీవితమె అర్పిస్తా
గురు రవిదాసు హృదయమందు – నీవే నిత్యం వెలిగేవు
జన్మబంధములు తొలగంగా – నీ కడకే నే చేరేను ॥
మనసే మందిరమై – ప్రేమయే పుష్పాలై
రామా! నీ పాదాలకు – హారతి ఇస్తినయా
No comments