అజరామరుడా అఖండుడా - Ajaraamaruda Akhanduda Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
అజరామరుడా – అఖండుడా
అనంతుడా –ఓ అవినాశా
నిర్గుణుడా - ఓ పరబ్రహ్మా!
హారతీ – నీకే హారతి ॥
1
అజరుడవు అమరుడవు –
అచలుడవు అనుపముడవు
రూపరహిత నిర్గుణుడవు –
చైతన్యమయ స్వరూపుడవు
సత్యస్వరూపుడ నీవే –
పరమానందుడవీవే
నిర్వికారమౌ నిరామయుడవు –
నీవే పరమాత్ముడవు ॥
అజరామరుడా – అఖండుడా
అనంతుడా –ఓ అవినాశా
నిర్గుణుడా - ఓ పరబ్రహ్మా!
హారతీ – నీకే హారతి ॥
2
అనంతుడవు నీవే అఖండుడవు నీవే –
అభేదుడవు నీవే అవ్యయుడవు నీవే
ఇంద్రియాలకు అందనివాడవు –
వర్ణనకసలే అందనివాడవు
ఎంత వెదికినా – ఎవ్వరు నిన్ను కనుగొనలేరయ్యా
హద్దులులేని తేజస్సు నీవే – నీవే బ్రహ్మమయా ॥
అజరామరుడా – అఖండుడా
అనంతుడా –ఓ అవినాశా
నిర్గుణుడా - ఓ పరబ్రహ్మా!
హారతీ – నీకే హారతి ॥
3
నీ నామమే దీపపు వత్తి – భక్తియే దానికి నెయ్యి
అఖండమైన ఆ జ్యోతి – నిండెను బ్రహ్మాండమంత
జీవరాశుల హృదయాల్లో వెలిగే జ్యోతి ఒకటే
ఆ జ్యోతిని దర్శిస్తే – చీకటి తొలగేనయ్య ॥
అజరామరుడా – అఖండుడా
అనంతుడా –ఓ అవినాశా
నిర్గుణుడా - ఓ పరబ్రహ్మా!
హారతీ – నీకే హారతి ॥
4
ఎందరెందరో ధ్యానించినా – నిన్ను చేరనేలేదు
ఎందరు జ్ఞానులు వెదికినా – నీ తత్త్వమందనే లేదు
మనసా వాచా కర్మణా – గురురవిదాసు కొలిచెను
హృదయమనే నీ గుడిలో – నీకే హారతి ఇచ్చేను
॥
అజరామరుడా – అఖండుడా
అనంతుడా –ఓ అవినాశా
నిర్గుణుడా - ఓ పరబ్రహ్మా!
హారతీ – నీకే హారతీ
No comments