Breaking News

కోటి సూర్య ప్రభా భాస - Koti Koti Surya Prabha Bhasa Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


కోటి సూర్య ప్రభా భాస 

కాల మేఘ ఘన గర్జన 

భం భం ఓ మహాకాళి 

ధ్వం ధ్వం ఓ మహాదుర్గ 


మహామాయ యోగనిద్ర

విష్ణుశయ్య నుండి లేచె  

ధర్మకార్య స్థాపనకై 

లోకమందు అవతరించె 


మధుకైటభ రక్కసులు 

విష్ణు కర్ణముల పుట్టిరి 

బ్రహ్మదేవు హతమార్చగ

ఉద్యమించె దుర్మతులై 


విశ్వమునకు ఈశ్వరియై 

స్థితిలయముల కారణమై 

విష్ణువు కన్నుల నిలిచిన 

నిద్రాదేవిని పొగిడిరి 


కోటి సూర్య ప్రభా భాస 

కాల మేఘ ఘన గర్జన 

భం భం ఓ మహాకాళి 

ధ్వం ధ్వం ఓ మహాదుర్గ 


సృష్టిస్థితిలయరూపం 

సత్వరజస్తమోగుణం 

అమ్మవారికాహ్వానం 

రాక్షసుల అంత్యకాలం 


మహామాయ మోహితులై 

మదోన్మత్త మధుకైటభుల్ 

విష్ణువుకే వరమివ్వగ 

వారి చావు కోరె విష్ణు 



శంఖ చక్ర గదాధారి 

విష్ణువు తనతొడలపైన 

మధుకైటభు తలలత్రుంచె 

పరమేశ్వరి ఉద్భవించె 


కోటి సూర్య ప్రభా భాస 

కాల మేఘ ఘన గర్జన 

భం భం ఓ మహాకాళి 

ధ్వం ధ్వం ఓ మహాదుర్గ 



దేవాసుర సంగ్రామం 

దేవతల పరాజయం 

మహిషాసుర పరాక్రమం 

ఇంద్రలోక ఆక్రమణం 



బ్రహ్మవిష్ణుమహేశ్వరుల 

దేవతలందరి తేజం 

శక్తుల సమస్టి రూపం

భగవతి ఆవిర్భావం 


అమ్మోరి అట్టహాసం 

మారుమ్రోగే ఆకాశం 

కంపించెను భూగోళం 

మహిషునితో పోరాటం


కోటి సూర్య ప్రభా భాస 

కాల మేఘ ఘన గర్జన 

భం భం ఓ మహాకాళి 

ధ్వం ధ్వం ఓ మహాదుర్గ 



నగారాల,శంఖ ధ్వని 

యుద్దోత్సవ ఘంటధ్వని 

రథగజహయపదాతి బలం 

నదులై పారెను రుధిరం 


మహిషాసురు బంధించె

పాదమెత్తి అదిమిపట్టె 

శూలంతో కళ్ళు పొడిచె 

ఖడ్గంతో తల నరికే 


అతిబల మహిషాసురుని 

అంతమయ్యే దుర్మార్గం

జగత్తంత వ్యాపించెను 

జగన్మాత జయధ్వానం


కోటి సూర్య ప్రభా భాస 

కాల మేఘ ఘన గర్జన 

భం భం ఓ మహాకాళి 

ధ్వం ధ్వం ఓ మహాదుర్గ

No comments