Breaking News

శివ-కేశవ భజన - Linganiki Ranganiki Bedama Song Lyrics in Telugu

 లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా


లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ - సుజ్ఞానికి వాదమా


బూడిదా ధరించేను లింగడూ

పట్టెనామాలు పెట్టేను రంగడు

బూడిదా ధరించేను లింగడూ

పట్టెనామాలు పెట్టేను రంగడు

త్రిశూలమ్ము పట్టేను లింగడు

శంఖ చక్రాలనే పట్టే రంగడు 

ఒహో 


లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా

లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా


పులి తోలు కట్టేను లింగడు

పట్టుపీతాంబరాలు కట్టె రంగడు

పులి తోలు కట్టేను లింగడు

పట్టుపీతాంబరాలు కట్టె రంగడు

పాము పాగ చుట్టేను లింగడు

ఆ పాముపై పవళించే రంగడు 

ఒహో 


లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా

లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ- సుజ్ఞానికి వాదమా


పార్వతీ నాథుడయ్య లింగడు

శ్రీ లక్ష్మీ సమేతుడే రంగడు

పార్వతీ నాథుడయ్య లింగడు

శ్రీ లక్ష్మీ సమేతుడే రంగడు

కైలాస వాసుడయ్య లింగడు

వైకుంఠ వాసుడమ్మ రంగడు

ఒహో 


లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా

లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ- సుజ్ఞానికి వాదమా


నందీ వాహనుడయ్య లింగడు

గరుడ వాహనుడే ఈ రంగడు

నంది వాహనుడయ్య లింగడు

గరుడ వాహనుడే రంగడు

ఓం నమశ్శివాయ లింగడు

హరేరామ - హరేకృష్ణ రంగడు


లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ -సుజ్ఞానికి వాదమా

లింగనికి రంగనికి భేదమా

జ్ఞానీ- సుజ్ఞానికి వాదమా

No comments