చిరంజీవి హనుమంతుడు - Hanuman Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమే హనుమంతుని
శ్రీ రామునితో కలిపే
రామనామమే పలికి లోకములు
ధన్యతనే పొందే
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమె నదిదాటించె
గుహుడానందించె
రామనామమె రాతినహల్యకు
పునర్ జన్మనిచ్చే
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమే భక్త శబరికి
భవబంధం త్రెంచె
రామనామమే మాత సీతలో
పవిత్రతను పెంచె
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమే శ్రీ హనుమంతుని
సంద్రము దాటించే
రామ నామమే అశోకవనమున
సీత జాడ తెలిపే
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమే విభీషణుని
శ్రీ రాముని దరి జెర్చే
రామనామమె వారధి కట్టె -
రావణు హతమార్చే
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
రామనామమే లంకను గెలిచే
ధర్మమునే నిలిపే
రామనామమె నేటి యుగానికి
తారక మంత్రమిదే
చిరంజీవి హనుమంతుడు జై శ్రీరామని
పలికే
రామనామమె మదిలో నిలిపి విజయం సాధించే
జై జై రామ్ - జై శ్రీ రామ్
జై జై శ్రీ రామ్ - జై శ్రీ రామ్
No comments