Breaking News

జయ జయ దుర్గే - Jaya Jaya Durge Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


జయ జయ దుర్గే జయ జయ కాళీ  

కరుణామయి దేవీ 

జయ జయ చండీ జయ జయ శైలజ  మహిషాసుర మర్దినీ 

 

గిరిపై వెలసిన గిరిజభవానీ

జగముల నేలే జనని మహానీ

సురగణ సేవిత సుందర రూపిణీ

జయ జయ జగదంబ జయ జయ దేవీ!


సర్వ శక్తులకు మూలము నీవే

భక్తుల హృదిలో వెలుగువు నీవే

చండ ముండులను దునుమాడినవే 

 జయ జయ చాముండి జయ దేవీ!కాళీ


మహిషుని గర్వము మట్టిలో కలిపి

రణమున గెలిచిన మహనీయ శక్తివై

దానవ సేనల దర్పము అణచిన

మహిషాసురమర్దిని  దేవీ!


త్రిశూల ధారిణి చండిక మాతా

ఖడ్గధారి కాళిక మాతా

సింహము నెక్కిన శౌర్యపు జ్యోతీ

దుష్టుల పాలిటి ప్రళయాగ్నివీ!


లక్ష్మిగ వెలసిసంపదనిచ్చే

సరస్వతివై విద్యనొసంగి 

అన్నపూర్ణవై ఆహారమిచ్చి 

అభయ ఆదిపరాశక్తి !


దీనుల దుఃఖం బాపిన తల్లీ

భక్తుల కోరిక తీర్చే తల్లీ

ఆపద వచ్చిన ఆదుకొంటివీ

 అమృతం పంచిన వాత్సల్యమయీ!

 

ధర్మము నిలిపిన దుర్గమ్మ 

అధర్మమణచిన కాళమ్మ 

విజయము నొసగిన విజయమ్మ 

జయ జయ మోహిని జగదంబ!


జయ జయ దుర్గే జయ జయ కాళీ  

కరుణామయి దేవీ 

జయ జయ చండీ జయ జయ శైలజ  మహిషాసుర మర్దినీ !


No comments