భగవాధ్వజమే గురువు - Bhagwa dwajame Guruvu Song Lyrics in Telugu
రచన : వెంకటేశన్
స్ఫూర్తి ప్రదాత విశ్వవిజేత
భగవా ధ్వజమే గురువు
పవిత్ర భగవా ధ్వజమే మన గురువు
సాధుపుంగవుల త్యాగనిరతికిది
సంకేతముగా వెలుగొందినది
దేశభక్తులౌ వీర పుత్రుల
క్షాత్ర శక్తిగా భాసిల్లినది
మంగళకరముగ మాతృమూర్తుల
నొసటి కుంకుమై శోభిల్లినది
స్ఫూర్తి ప్రదాత విశ్వవిజేత
భగవా ధ్వజమే గురువు
పవిత్ర భగవా ధ్వజమే
మన గురువు
హరిత క్షేత్రముల అన్నదాతల
స్వేదరుధిరమై ఉప్పొంగినది
ధన్యజీవులౌ శ్రామికజనుల
సేవలతో పులకించినది
జాతిని నడిపిన మహానుభావుల
జయకేతనమై నింగికెగసినది
స్ఫూర్తి ప్రదాత విశ్వవిజేత
భగవా ధ్వజమే గురువు
పవిత్ర భగవా ధ్వజమే
మన గురువు
చతుర్వేదములు, ఉపనిషత్తులు
దమ్మ పథమ్ము, తీర్థంకరములు
వీరశైవాది సర్వమతమ్ముల
ఏకీకృత సాకార రూపమై
యుగయుగాలుగా జగతినందరికి
మార్గదర్శియై విలసిల్లినది
స్ఫూర్తి ప్రదాత విశ్వవిజేత
భగవా ధ్వజమే గురువు
పవిత్ర భగవా ధ్వజమే
మన గురువు
పూజ్య కేశవుని మదిలో మెలిగిన
తత్వనిష్ఠకిది త్యాగ కేతనం
శక్తి, శీలము,వివేక జ్ఞానం
అందించే మన భగవపతాకం
స్వయంసమర్పిత దేశసేవకుల
లక్ష్య సాధనకు స్ఫూర్తి ప్రతీకం
స్ఫూర్తి ప్రదాత విశ్వవిజేత
భగవా ధ్వజమే గురువు
పవిత్ర భగవా ధ్వజమే
మన గురువు
No comments