Breaking News

ఏమనుకున్నవ్ గణపతేమనుకున్నవ్ - Teenmar Ganapathi Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్



ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రాక్షసుల్ని తరిమికొట్టె


మత్సరాసురుడంట

అసూయతొ వచ్చెనంట

వక్రతుండ గణపతొచ్చి

మడతపెట్టి మట్టుపెట్టె


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రాక్షసుల్ని తరిమికొట్టె


మదమెక్కిన రక్కసి

గర్వంతో విర్రవీగే

ఏకదంత గణపతొచ్చి

ఏకంగా ఎగిరి తన్నె


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రాక్షసుల్ని తరిమికొట్టె 



మోహాసురుడే వచ్చి

మోహజాలమే విసిరే

పెద్దపొట్ట గణపతొచ్చి

పొట్టు పొట్టు చితక్కొట్టె


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


లోభాసురుడంట

పిసినారి రక్కసంట

గజరూపం గణపతొచ్చి

గట్టి ముష్టి దెబ్బకొట్టె


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


క్రోధాసురుడంట

కోపంతొ దండెత్తే

లంబోదర గణపతొచ్చి

ఉరికురికి నీటముంచె 


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


కామాసురుడొచ్చి

పిచ్చిగ వేశాలేస్తె

వికటావతారంలొ

గణపతొచ్చి దంచిగొట్టె


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


మమతాసురుడంట

దురభిమానమే తెస్తే

విఘ్నరాజ గణపతొచ్చి

దుమ్ము దుమ్ము దులిపిండు


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


సింధురాసురుడంట

మందేసి చిందులేస్తే

మయూర గణపతొచ్చి

మక్కలిరగ తన్నిండు


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె


గజముఖ రాక్షసుడు

దొంగదెబ్బ వేస్తుంటే

ఎలుకెక్కి గణపతొచ్చి

ఏరికోరి లేపేసే 


ఏమనుకున్నవ్

గణపతేమనుకున్నవ్

ఒక్కసారి పిల్వంగనే

రక్కసుల్ని తరిమికొట్టె

No comments