Breaking News

డప్పుల్ దంచికొట్టి - Ganesh DJ Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


అమ్మ చేసిన బొమ్మర

తండ్రిచ్చిన వరంరా

ఎలుకనెక్కి తిరిగెరా

దొంగలనే తరిమెరా


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


పన్ను చేతపట్టెర

భారతమే రాసెరా

ఒంటికాలి నాట్యమాడి

అందరి మెప్పించెరా


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


తొండమెత్తినాడురా

బరువులే మోసెర

చాట చెవుల దాల్చి

చెడునంత చెరిపెరా


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


కన్నులేమో చిన్నవి

చూపు గట్టిగుండెరా

పొట్టేమో పెద్దది

మర్మమంత దాచెరా


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


దేహం భారీ గున్నా

లోకం చుట్టొచ్చెర

ఏనుగు ముఖమున్నా

సుందర రూపం వాడే


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


తొమ్మిదిరాత్రుల పూజ

ఆఖరున మ్రోగె బాజా

నిమజ్జనం సాగించగ

భక్త జనం కదిలెరా


డప్పుల్ దంచికొట్టి

డోల్ మోగించర

గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా


గణపతినూరేగించి

తీన్ మార్ కొట్టరా

No comments