ఇంటింటా గణపతి - Teenmaar Ganapathi Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
గణగణగణ గణనాథుడ
గుణములందించెరా
దుమ్ము రేపి వచ్చెరా
దుర్గుణాల తుంచెరా
ఇంటింటా గణపతి
వీధివీధికొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
కులం గిలం చూడకుర
హిందువులై లేచిరా
అందరం బంధువులం
కలసిమెలసి వచ్చెరా
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
అంగరంగ వైభవంగ
చిందులేసే గణపతి
తిలక్ తెచ్చిన గణపతి
గంతులేసె గణపతి
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
వందేమాతరమంటూ
గోంతొత్తె గణపతి
స్వాతంత్య్రం తెచ్చిండు
సంబరాల గణపతి
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
స్వదేశి వస్తువులు
కొనితెచ్చె గణపతి
స్వాభిమానమందించె
ఈ మట్టి గణపతి
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
సామూహిక భోజనం
కలిసి చేసే కీర్తనం
గణపతి ఘనగర్జనం
శత్రుమూక భంజనం
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
భక్తుల ఆరాధనం
శక్తుల ఆవాహనం
నవరాత్రి పూజనం
గణపతినిమజ్జనం
ఇంటింటా గణపతి
వీధివీధి కొచ్చెరా
జనంమెచ్చు గణపతి
జనంలోకి వచ్చెరా
No comments