జనక జనక జెనారె - Janaka Janaka Janare Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
జనక జనక జెనారె
గణగణగణ గణారె
గంటలేమొ ఘల్లుమనే
గజ్జె కట్టె గణపతి
యువజనమే మెచ్చిరే
గణనాథుని తెచ్చిరే
పిల్ల పాప వచ్చిరే
పువ్వుల పూజించిరే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
దండలేసి దండాలె
నైవేద్యం ఉండ్రాల్లే
తాళం చప్పట్లు కొట్టె
ఊరువీధి సంబరాలే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
గంగంగం గణపతి
గజరూపం గణపతి
మా బొజ్జ గణపతి
మా బుజ్జి గణపతి
జనక జనక జెనారె
గణగణగణ గణారె
ఇష్టమైన కుడుములిస్తె
కష్టాల్ తొలగించెరా
నవ రాత్రుల్ పూజించే
మమ్ముల కాపాడరా
జనక జనక జెనారె
గణగణగణ గణారె
ఢమ్ డమ్మను చప్పుల్లే
ధిం దిమ్మను శబ్దాలే
ఏక దంత తొండమెత్తె
జనమంత జయ్ అనరే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
ఎలుక వాహనం ఎక్కి
పలుకు పలకరించెనే
సిద్ది బుద్ధులే ఇచ్చి
సుద్దులేమో చెప్పెనే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
ఆటంకం రాకుండా
అమ్మ నాన్నకే మ్రొక్కె
విఘ్నాలే లేకుండా
వినాయకుని మ్రొక్కరే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
సదువు సల్లగుండాలే
మెతుకుబ్రతుకు దక్కాలే
పంట పచ్చగుండాలని
గణపతిని కోరాలే
జనక జనక జెనారె
గణగణగణ గణారె
No comments