శ్రీ లక్ష్మీనరసింహుడా - Sri Narasimha Swami Bhajana Songs
రచన - అప్పాల ప్రసాద్
శ్రీ లక్ష్మీనరసింహుడా
నీ మహిమ
తెలియకుండ ఉండలేరయ
బీర్పూర్ నర్సింహుడా - లక్ష్మి నరసింహుడా
ధరంపురి నరసింహుడ దయజూపి ఏలినోడా
అడవిలోని పక్షులకు ఆహారం ఎవరిచ్చిరి?
పులి -సింహం జాతులకు ఆకలెవరు తీర్చిరి ?
అడవిలోని పక్షులకు ఆహారం ఎవరిచ్చిరి?
పులి -సింహం జాతులకు ఆకలెవరు తీర్చిరి?
వృక్షాలకు నీల్లిచ్చి పోషణ చేసిందెవరు?
స్త్రీగర్భమునందున శిశువును పెంచిందెవరు?
శ్రీ లక్ష్మీనరసింహుడా
నీ మహిమ
తెలియకుండ ఉండలేరయ
బీర్పూర్ నర్సింహుడా - లక్ష్మి నరసింహుడా
ధరంపురి నరసింహుడ దయజూపి ఏలినో
పాములకు పాల్ పోసి,పశువులకు మేతనిచ్చి
సకల ప్రాణి పోషింపగ నిన్ను మించిన దాత లేడు
పాములకు పాల్ పోసి,పశువులకు మేతనిచ్చి
సకల ప్రాణి పోషింపగ నిన్ను మించిన దాత లేడు
లబ్ లబ్బని గుండెధ్వని రక్తమేమొ ఉరకలెత్తె
పుట్టుక గిట్టుక కథలను చేపట్టిన నరసింహా
శ్రీ లక్ష్మీనరసింహుడా
నీ మహిమ
తెలియకుండ ఉండలేరయ
బీర్పూర్ నర్సింహుడా - లక్ష్మి నరసింహుడా
ధరంపురి నరసింహుడ దయజూపి ఏలినోడ
గతి తప్పక గ్రహాలన్నీ క్రమముగ త్రిప్పేదెవరు
గాలి నీరు మానవాళి కందించేదింకెవరు
గతి తప్పక గ్రహాలన్నీ క్రమముగ త్రిప్పేదెవరు
గాలి నీరు మానవాళి కందించేదింకెవరు
బ్రహ్మాండం బ్రద్ధలైన మళ్ళీ సృష్టించెదెవరు
నీ లీలలు మాకందవు మమ్ము బ్రోవు నరసింహా
శ్రీ లక్ష్మీనరసింహుడా
నీ మహిమ
తెలియకుండ ఉండలేరయ
బీర్పూర్ నర్సింహుడా - లక్ష్మి నరసింహుడా
ధరంపురి నరసింహుడ దయజూపి ఏలినోడ
No comments