ఓ నర్సింహా శ్రీ లక్ష్మి నర్సింహా - Sri Lakshmi Narasimha Swamy Bhajana Songs Telugu
రచన - అప్పాల ప్రసాద్
ఓ నర్సింహా - శ్రీ లక్ష్మి నర్సింహా
నీ నామం గొప్ప ఇప్పుడెరుకైందన్న
నిత్యం నీ భజన చేస్తె ఎరుకైందన్నా
నీ దివ్యనామం మేం జెప్పంగనే
చేసిన మా చెడునంత తోలవచ్చని
నీ దివ్యనామం మేం జెప్పంగనే
చేసిన మా చెడునంత తోలవచ్చని
నీ నామం నాల్కపైన ఆడంగనే
బలమైన రోగాలను బాపవచ్చని
ఓ నర్సింహా -శ్రీ లక్ష్మి నర్సింహా
నీ నామం గొప్ప ఇప్పుడెరుకైందన్న
నిత్యం నీ భజన చేస్తె ఎరుకైందన్నా
మా గొంతుతొ నీ నామం పల్కంగనే
శత్రువుల పట్టి తన్ని తరమొచ్చని
మా గొంతుతొ నీ నామం పల్కంగనే
శత్రువుల పట్టి తన్ని తరమొచ్చని
నీ రూపం చెదరకుండ నాలో ఉంటే
యమదూతలు యమయాతన పెట్టలేరని
ఓ నర్సింహా - శ్రీ లక్ష్మి నర్సింహా
నీ నామం గొప్ప ఇప్పుడెరుకైందన్న
నిత్యం నీ భజన చేస్తె ఎరుకైందన్నా
తెలియక నేనిన్నాళ్ళు దారి తప్పితి
తెలిసినంక నీ తొవ్వల కాలు పెట్టితి
తెలియక నేనిన్నాళ్ళు దారి తప్పితి
తెలిసినంక నీ తొవ్వల కాలు పెట్టితి
భళి భళిర నర్సింహా భలే నామమే
నీ వేలు పట్టుకుంటే చాలు వైకుంఠమే
ఓ నర్సింహా - శ్రీ లక్ష్మి నర్సింహా
నీ నామం గొప్ప ఇప్పుడెరుకైందన్న
నిత్యం నీ భజన చేస్తె ఎరుకైందన్నా
నిత్యం నీ భజన చేస్తె ఎరుకైందన్నా
No comments