Breaking News

భయమేలరా స్వామి భజనచేయరా - Lakshmi Narasimha Swami Bhajana Patalu

రచన - అప్పాల ప్రసాద్



భయమేలరా - స్వామి భజనచేయరా 

కల్పవృక్షమై లక్ష్మీ నర్సింహుడుండగ

ఎవరేమనుకున్నగాని భజన చేయరా 



మందబుద్ది వాడని నను నిందజేస్తరు 

దీనుడ హీనుడ నంటూ నవ్వుకుంటరు 

దూరం దూరం అంటూ తూలనాడ్తరు 

ప్రేమించక పోగ నాకు వంక పెడ్తరు 


భయమేలరా - స్వామి భజనచేయరా 

కల్పవృక్షమై లక్ష్మీ నర్సింహుడుండగ

ఎవరేమనుకున్నగాని భజన చేయరా 



ఎకసక్కాల్ చేసి నన్ను వెక్కిరిస్తరు 

కోపం నసాళమెక్కి తిట్టిపోస్తరు 

హెచ్చుమాటలాడి నను చీదరిస్తరు 

దాపటగా చేరి వేళాకోళం చెస్తరు 


భయమేలరా - స్వామి భజనచేయరా 

కల్పవృక్షమై లక్ష్మీ నర్సింహుడుండగ

ఎవరేమనుకున్నగాని భజన చేయరా 



జనం మెప్పుకోసం ఈ భజన కాదురా 

దండిగ భాగ్యము పొందే ఆశ లేదురా 

పొట్ట నింపు  పాటలకిది పాడి కాదురా 

పేరు ప్రతిష్టల్ తెచ్చే నటన కాదురా 


భయమేలరా - స్వామి భజనచేయరా 

కల్పవృక్షమై లక్ష్మీ నర్సింహుడుండగ

ఎవరేమనుకున్నగాని భజన చేయరా 



చిత్తశుద్ధితొ స్వామి సేవ చేయగా 

జన్మపావనం చెందగ స్మరణ చేస్తిని 

ముక్తి కోసమే నేను మొక్కి వేడితి 

పరమార్థం పొందగ ప్రాకులాడితి 


భయమేలరా - స్వామి భజనచేయరా 

కల్పవృక్షమై లక్ష్మీ నర్సింహుడుండగ

ఎవరేమనుకున్నగాని భజన చేయరా


No comments