Breaking News

నరహరి నామంతో భజన చేతురా - Narasimha Swami Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్


బతికినంతవరకు నీ భజన చేతురా

ఆ మరణ కాలమొచ్చినప్పుడు మరతునేమొరా

నరహరి నామంతో భజన చేతురా


యమదూతలు కోపంతో వచ్చినప్పుడు

ప్రాణాలు పెకిలించి లాగినప్పుడు

యమదూతలు కోపంతో వచ్చినప్పుడు

ప్రాణాలు పెకిలించి లాగినప్పుడు

భయంతో భజనచేయ మరతునేమొరా

నరహరి నామంతో భజన చేతురా

నరహరి నామంతో భజన చేతురా


బతికినంతవరకు నీ భజన చేతురా

ఆ మరణ కాలమొచ్చినప్పుడు మరతునేమొరా

నరహరి నామంతో భజన చేతురా


రోగాలు రొప్పులొచ్చి తూగినప్పుడు

కఫం వాత పైత్యాలు కప్పినప్పుడు

రోగాలు రొప్పులొచ్చి తూగినప్పుడు

కఫం వాత పైత్యాలు కప్పినప్పుడు

గొంతెత్తి భజన చేయ మరతునేమొరా

ఆరోగ్యం ఉన్నంతనే భజన చేతురా

ఆరోగ్యం ఉన్నంతనే భజన చేతురా


బతికినంతవరకు నీ భజన చేతురా

ఆ మరణ కాలమొచ్చినప్పుడు మరతునేమొరా

నరహరి నామంతో నీ భజన చేతురా


దీర్ఘకాల వ్యాధితో మంచమెక్కినప్పుడు

ఉబ్బసమె వచ్చి ఊపిరందనప్పుడు

దీర్ఘకాల వ్యాధితో మంచమెక్కినప్పుడు

ఉబ్బసమె వచ్చి ఊపిరందనప్పుడు

నాల్క నుండి మాట రాక మరతునేమొరా

మాట చక్కగున్నప్పుడే భజన చేతురా

మాట చక్కగున్నప్పుడే భజన చేతురా


బతికినంతవరకు నీ భజన చేతురా

ఆ మరణ కాలమొచ్చినప్పుడు మరతునేమొరా

నరహరి నామంతో భజన చేతురా


సంసారం మమకారం పెరిగినప్పుడు

ధనార్జన వ్యామోహం క్రమ్మినప్పుడు

సంసారం మమకారం పెరిగినప్పుడు

ధనార్జన వ్యామోహం క్రమ్మినప్పుడు

ఆశల పడి నోరాడక మరతునేమొరా

దురాశ చేరకముందె భజన చేతురా

దురాశ చేరకముందె భజన చేతురా


బతికినంతవరకు నీ భజన చేతురా

ఆ మరణ కాలమొచ్చినప్పుడు మరతునేమొరా

నరహరి నామంతో భజన చేతురా

నరహరి నామంతో భజన చేతురా

నరహరి నామంతోభజన చేతురా

బతికినంతవరకు నీ భజన చేతురా

No comments