Breaking News

కొండపైన వెలసిన ఓ లక్ష్మీ నర్సింహుడా - Lakshmi Narasimha Swami Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్


కొండపైన వెలసిన ఓ లక్ష్మీ నర్సింహుడా - 

కోటి కోటి దండాలయ్యా  నర్సింహా -నర్సింహా 

మా మనసులోని మాటనెరుగు నర్సింహా..నర్సింహా 



ఐశ్వర్యాలివ్వాలని నీ వెంట తిరుగలేదు 

భూములు నాకిమ్మని నమ్మి నమ్మి పల్కలేదు 

బంగారం మింగలేము బంధాల్లో చిక్కినాము 

తల్లి దండ్రి గురువు నీవే నర్సింహా 

ఈ పేదవాన్ని కరుణించు నర్సింహా 


కొండపైన వెలసిన ఓ లక్ష్మీ నర్సింహుడా - 

కోటి కోటి దండాలయ్యా  నర్సింహా -నర్సింహా 

మా మనసులోని మాటనెరుగు నర్సింహా..నర్సింహా



తల్లిగర్భం నుండి ధనము తేడు ఎవ్వడైన

ఉప్పుకారం తినాల్సిందే లక్షాధికారైనా 

దాచిబెట్టిన సొమ్మంతా దొంగల పాలయ్యేనా 

మా భ్రమలను పోగొట్టు నర్సింహా 

యమకింకరులడ్డగించు నర్సింహా 


కొండపైన వెలసిన ఓ లక్ష్మీ నర్సింహుడా - 

కోటి కోటి దండాలయ్యా  నర్సింహా -నర్సింహా 

మా మనసులోని మాటనెరుగు నర్సింహా..నర్సింహా


రమ్యంగా కీర్తించే నారదున్ని నేను కాను 

సేవ జేసి మెప్పించే శబరి మాత నేను గాను 

ఘనముగ గ్రంథాల్ రాసే వ్యాసుండసలే కాను 

ప్రహ్లాదుని అండ దండ నర్సింహా 

హీనుడ నన్నేలుకొనుము నర్సింహా 


కొండపైన వెలసిన ఓ లక్ష్మీ నర్సింహుడా - 

కోటి కోటి దండాలయ్యా  నర్సింహా -నర్సింహా 

మా మనసులోని మాటనెరుగు నర్సింహా..నర్సింహా

No comments