Breaking News

భజనలు చేద్దాం పూజలు చేద్దాం హరే హరే - Sri Lakshmi Narasimha Swami Bhajana Songs in Telugu

 రచన - అప్పాల ప్రసాద్


భజనలు చేద్దాం పూజలు చేద్దాం హరే హరే

నర్సింహస్వామికి అర్చన చేద్దాం హరే హరే

భజనలు చేద్దాం హరే హరే..ఓ ఓ ఓ


మా మేలుకోరే నరసింహుని కోరి కొలిచేము

మా మేలుకోరే నరసింహుని కోరి కొలిచేము


భజనలు చేద్దాం పూజలు చేద్దాం హరే హరే

నర్సింహస్వామికి అర్చన చేద్దాం హరే హరే

భజనలు చేద్దాం హరే హరే..ఓ ఓ ఓ


నా నోరూ భజన కోరు

నా నాల్క నిన్ను కీర్తించు

నా చేతుల్ నిన్ను మొక్కే

నా చెవులే  కథలు వినెనే

నా తనువు  సేవలోనే

నా కనులే నిన్ను కనెనే


భజనలు చేద్దాం పూజలు చేద్దాం హరే హరే

నర్సింహస్వామికి అర్చన చేద్దాం హరే హరే

భజనలు చేద్దాం హరే హరే..ఓ ఓ ఓ


జ్ఞానుల నిందించకుంటే చాలు 

సదువులెన్నో చదివినట్లే

సజ్జనుల ముంచకుంటే చాలు 

బహుమతులే ఇచ్చినట్లే

గుడిమాన్యాలు దోచకుంటే చాలు 

గుళ్ళేన్నో కట్టినట్లే 


భజనలు చేద్దాం పూజలు చేద్దాం హరే హరే

నర్సింహస్వామికి అర్చన చేద్దాం హరే హరే

భజనలు చేద్దాం హరే హరే..ఓ ఓ ఓ

No comments