శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు - Sri Lakshmi Narasimha Swami Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
నీ పాదాల పడియుంటీ ఓ ఓ ఓ
నీ పాదాల పడియుంటి
నరహరి.. నిన్నే వేడితిని
నీ సేవలే చేసితిని
గోదారి స్నానం చేద్దామంటే
చన్నీళ్ల మునగనే లేను
తీర్థ యాత్రలు చేద్దామంటే
నడచి అలసిపోలేను
గోదారి స్నానం చేద్దామంటే
చన్నీళ్ల మునగనే లేను
తీర్థ యాత్రలు చేద్దామంటే
నడచి అలసిపోలేను
దాన ధర్మముల్ ఇద్దామంటే ఏ ఏ ఏ
దానధర్మముల్ ఇద్దామంటే
దండిగ ధనమే లేదు
నీ పాదాల పడియుంటీ ఓ ఓ ఓ
నీ పాదాల పడియుంటి
నరహరి.. నిన్నే వేడితిని
నీ సేవలె చేసితిని
తపమాచరించి ఉందామంటే
మనసు నిలుపలేను
నిత్యం నిన్ను పూజిద్దమంటే
పూజా ద్రవ్యం తేలేను
తపమాచరించి ఉందామంటే
మనసు నిలుపలేను
నిత్యం నిన్ను పూజిద్దమంటే
పూజా ద్రవ్యం తేలేను
నామజపం నే చేస్తూవుండే ఏ ఏ ఏ
నామజపం నే చేస్తూవుండే
అదృష్టమే అందించు
నీ పాదాల పడియుంటీ ఓ ఓ ఓ
నీ పాదాల పడియుంటి
నరహరి.. నిన్నే వేడితిని
నీ సేవలే చేసితిని
దీక్షలు మాలలు వేద్దామంటే
పనుల తీరికే లేదు
ఆడంబరంగ అర్చిద్దమంటే
సంపదలసలే లేవు
దీక్షలు మాలలు వేద్దామంటే
పనుల తీరికే లేదు
ఆడంబరంగ అర్చిద్దమంటే
సంపదలసలే లేవు
నామస్మరణతో నా కోరికలే ఏ ఏ ఏ
నామస్మరణతో నా కోరికలే
నెరవేర్చగా రారా
నీ పాదాల పడియుంటీ ఓ ఓ ఓ
నీ పాదాల పడియుంటి
నరహరి.. నిన్నే వేడితిని
నీ సేవలే చేసితిని
No comments