హారతి గైకొనుమా గణపతి - Harathi Gaikonuma Ganapati Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
హారతి గైకొనుమా గణపతి
హారతి గైకొనుమా
మా మొరలే వినరావా
బాధలు బాపగ రావా
పార్వతి నందన గణపతి
పరమేశ్వర సుతుడా
గణపతి
పరమేశ్వర సుతుడా
కోరిన కోర్కెలు తీర్చే
కోరిన కోర్కెలు తీర్చే
గణాధిపతి నీవే
హారతి గైకొనుమా
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
తల్లివి తండ్రివి నీవే
నిన్నే నమ్మితినీ గణపతి
నిన్నే నమ్మితినీ
కష్టములను కడతేర్చి
కష్టములను కడతేర్చి
నా తోడుగ ఉండుమయా
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
అందరి హృదయంలోన
ఆత్మగ వెలసితివీ గణపతి
ఆత్మగ వెలసితివీ
ఆత్మానందం పొందగ
ఆత్మానందం పొందగ
నిన్నే వేడితిమి
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
భక్తితొ భజనలు చేసి
భారము వేసితిమి
నీపై
భారము వేసితిమి
అందరి బంధువు నీవే
అందరి బంధువు నీవే
మమ్ముల బ్రోవుమయా
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
రోగము నొప్పులు లేని
ఆరోగ్యజీవనము
అందించు
ఆరోగ్య జీవనం
భయ సంకటములు లేని
భయ సంకటములు లేని
రక్షకుడవు నీవే
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
పిల్లలు పాపలు కలిసి
నీ సేవలే చేసె
స్వామీ
నీ సేవలే చేసె
సిద్ది బుద్ధులను ఇచ్చే
సిద్ది బుద్ధులను ఇచ్చే
జ్ఞాన దాత నీవే
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
చదువులసారం నేర్చి
జ్ఞానం పొందెదము
స్వామీ
జ్ఞానం పొందెదము
నీ శరణాగతి పొంది
నీ శరణాగతి పొంది
నిన్నే చేరుదుము
హారతి గైకొనుమా
గణపతి
హారతి గైకొనుమా
No comments