Breaking News

గణపతి హారతి పాటలు - Mangalam Mangalam Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం


పార్వతీశ నందనా

జగవందన వినాయక

అందరు ఆనందమొందె

సర్వ మంగళం


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం


మూషికవాహన దేవా

ముల్లోకాల్ చుట్టివచ్చి

తలిదండ్రుల ప్రేమనొందె

ముదిత మంగళం


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం


భక్తి శ్రద్ధలాచరిస్తె

కోరినంత వరములిచ్చు

సిద్ధిబుద్ధులండ నుండె

భవ్య మంగళం


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం


కుడుములతో పూజించగ

ఇడుములు తొలగించితివి

దీనజనుల పోషిస్తివి

ఇష్ట మంగళం


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం


అడుగడుగున విఘ్నాలను

తొలగించగ విచ్చేసిన

ఏకదంత గజాననా

సతత మంగళం


మంగళం మంగళం

గణనాథా మంగళం

దివ్య శ్రేష్ఠ మంగళం

దేవ మంగళం

No comments