Breaking News

ఓం గణపతి శ్రీ గణపతి మంగళమో దేవా - Ganesh Harathi Songs in Telugu

రచన - అప్పాల ప్రసాద్



ఓం గణపతి శ్రీ గణపతి

మంగళమో దేవా

గణనాథా నీ సన్నిధి

మంగళమో దేవా


విఘ్నహర్త సుఖకర్తా 

మణిముకుటధారి

రత్నఖచిత సింహాసన

అధిరోహణ శౌరి 


ఓం గణపతి శ్రీ గణపతి

మంగళమో దేవా

గణనాథా నీ సన్నిధి

మంగళమో దేవా


బొజ్జ గణపతీ నీకు

ఉండ్రాళ్లిచ్చేము

మూషికవాహన మూర్తి

నిన్నే తలిచేము


ఓం గణపతి శ్రీ గణపతి

మంగళమో దేవా

గణనాథా నీ సన్నిధి

మంగళమో దేవా


సుందర మోహన మూర్తి

అందరం బంధువులం 

నీ దర్శన భాగ్యంతో

అందం ఆనందమే


ఓం గణపతి శ్రీ గణపతి

మంగళమో దేవా

గణనాథా నీ సన్నిధి

మంగళమో దేవా

No comments