బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి - Ganesh Harathi Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి
బొజ్జ గణపతికి మంగళం
అండపిండ బ్రహ్మాండము నిండిన
వక్రతుండ జయ మంగళం
అరిషడ్వర్గము నిర్మూలించే
జ్ఞాన ఖడ్గదా! మంగళం
తుండము ఏకదంతము కలిగిన
లంబోదర జయ మంగళం
అమ్మ నాన్నయే సర్వ లోకమని
చుట్టి వచ్చితివి మంగళం
బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి
బొజ్జ గణపతికి మంగళం
అండపిండ బ్రహ్మాండము నిండిన
వక్రతుండ జయ మంగళం
సకల దేవతలు ముందే కొలుతురు
విఘ్నవినాయక మంగళం
ఆషాడమ్మున నవరాత్రుల్లో
దర్శనమిస్తివి మంగళం
మూషికవాహన గజరూపా
సుందర వదనా మంగళం
బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి
బొజ్జ గణపతికి మంగళం
అండపిండ బ్రహ్మాండము నిండిన
వక్రతుండ జయ మంగళం
ప్రేమ నివేదన కుడుము సేవనం
సిద్ది బుద్ది జయ మంగళం
స్నానపాన వస్త్రాదుల పొందే
శాంతమూర్తి జయ మంగళం
గరిక పూజనం నిత్య అర్చనం
మంగళమూర్తి మంగళం
బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి
బొజ్జ గణపతికి మంగళం
అండపిండ బ్రహ్మాండము నిండిన
వక్రతుండ జయ మంగళం
షోడశోపచారాలన్నిటితో
నిను సేవించితి మంగళం
తెలియక చేసిన అపచారాలను
మన్నించి బ్రోవర మంగళం
శ్రద్ధాభక్తులతో నే కొలిచితి
అడిగిన వీయర మంగళం
పుట్టుట గిట్టుట కొరకే అంటూ
భవబంధం తెంపర మంగళం
బుడి బుడి అడుగుల గజ్జెల సవ్వడి
బొజ్జ గణపతికి మంగళం
అండపిండ బ్రహ్మాండము నిండిన
వక్రతుండ జయ మంగళం
No comments