దేశ ధర్మ రక్షణలో - Desha Dharma Rakshanalo Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
దేశ ధర్మ రక్షణలో
అలసిసొలసి సంచరించు
బంజారా జాతి ప్రజల
దీప కళిక సేవాలాల్
చెట్టు పుట్ట గుట్టలందు
నిరంతరం నిఘా వేయు
బంజారా కోటి ప్రజల
మార్గ దర్శి సేవాలాల్
బంజారుల వలసలాపి
స్థిర నివాసమేర్పరచి
తండాల అభివృద్ధికి
బాట వేసే సేవాలాల్
మూఢనమ్మకాల్ తృంచి,
స్వావలంబనే పెంచి
ధర్మ రక్ష,సత్య దీక్ష -
పిలుపు నిచ్చే సేవా లాల్
లక్షలాది గోవులను
వెంట తోడ్కోని పోగా
పచ్చని పంటల సిరులే
పండించె సేవాలాల్
బంజారాలర్చించే
సప్త మాతృ దేవతలను
నిరంతర సాధనతో
దర్శించె సేవాలాల్
ఆధ్యాత్మిక చైతన్యం
ఆత్మ గౌరవం నింపి
సంస్కృతీ సంరంభం
వెద జల్లే సేవాలాల్
విదేశీయ దాడులతో
వికలమైన మనస్సుల్లో
స్వాభిమాన స్వధర్మాన్ని
స్థాపించె సేవాలాల్
వ్యసన ముక్త సేవ యుక్త
మానవతా ధర్మ బోధ
సగౌరవం సమైక్యతా
సందేశం సేవాలాల్
కుటుంబాల పరిరక్షణ
యువతకు నైతికశిక్షణ
భక్తి శక్తి సద్గుణాల
ప్రసాదించే సేవాలాల్
No comments