సంత్ సేవాలాల్ భక్తి గీతాలు - Sant Sevalal Bhakti Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
తండోపతండాలకండదండైవుండిదండాలదండిమేరమ్మ కొలువంగ,
బంజార గుండెల్లొగుడికట్టి కొలువున్నఅంబజగదంబవర
ప్రసాదమైఅవతరించినసంతు సేవాలాల్
పదిహేడు వందల ముప్పైతొమ్మిది
పిబ్రవరిపదిహేనుఅనంతపురమున
తల్లిధర్మిణియాడి,తండ్రి భీమానాయక్
అంబజగదంబకొలవంగకోరంగ
భూమిపైదిగివచ్చికష్టాలుకడతెర్చి
కన్నీళ్లుతుడిచేసికారుణ్యమేచూపి
సంతుసేవాలాలుఅంతటాతానుండి
భూమిపోషణజేయఆవులనుతోడ్కోని
పాడిపంటల్నిచ్చిధర్మాన్నికాపాడి
వేలాదిమందికిదాహమాకలితీర్చి
మృతదేహాలకుతిరిగిఊపిరిపోసి
విషపూరితమ్మైనఅన్నమమృతంజేసి
దైవికవిద్యతొవైద్యాన్నిఅందించి
నిజాం ,తెల్లదొరలన్యాయమెదిరించి
మతమార్పిడీనాపిమూఢ నమ్మకమాపి ,
గోసంపద పెంచితండాలభివృద్ధికంకణం
కట్టుకునికష్టించిపనిజేసిమద్యపానంలేనిగ్రామాల
సృష్టించినిత్యసంచారియైహృదయాలనే గెల్చిఅందరికి
ఆరాధ్యదైవమై నిల్చిన సంతు సేవాలాల్...
తండోపతండాలకండదండైవుండిదండాలదండి మేరమ్మ కొలువంగ,
బంజార గుండెల్లోగుడికట్టి
కొలువున్నఅంబజగదంబవర
ప్రసాదమైఅవతరించినసంతు సేవాలాల్..
బంజారబంధువులు సాత్ భవానీ మాత పూజించి
అర్చించి ధర్మాన్ని రక్షించే ఆధ్యాత్మికం
భేదభావంలేక జనమంత కలిసుండి పండుగలు
జరుపుతూ సామరస్యంనిలిపె సామాజికం
హిందుధర్మానికి కొండంత అండయై
విశ్వాసమే నింపివిలువలే అందించు సంతు సేవాలాలు జనియించె నిచ్చోట
అంచెలంచెలుగెదిగిఆధ్యాత్మశిఖరాలనధిరోహణంజేయుసర్వజనరక్షకుడు
గోసేవ గోరక్ష గోపాలపోషకుడు సంతు సేవాలాల్
మాటయేబాటగానేటిబంజారాలుయువతరంనవతరం
నేత్రుత్వకర్తృత్వ బ్రాత్రుత్వ భావనతొ
జై సేవాలాల్ జయ కేతనమ్మెత్తి
సంతు సేవాలాల్ కలలు నెరవేర్చాలి
సంతు మహితాత్ముని కీర్తినే చాటాలి
తండోపతండాలకండదండైవుండిదండాలదండిమేరమ్మ కొలువంగ,
బంజార గుండెల్లోగుడికట్టి
కొలువున్నఅంబజగదంబవర
ప్రసాదమైఅవతరించినసంతు సేవాలాల్
No comments