Breaking News

యువశక్తి లేలేరా జవసత్తువ నీదేరా - Yuvashakti Lelera Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


యువశక్తి లేలేరా 

జవసత్తువ నీదేరా 


మాదక ద్రవ్యాల సేవనం  

దిగజారును మనిషి జీవనం

నర నరాన చేతనతో 

యుగయుగాల వెలుగు పంచు 

జ్ఞానం విజ్ఞానంతొ 

మానవతను రగిలించు 


యువశక్తి లేలేరా 

జవసత్తువ నీదేరా 


కలలే నీ కనుల నింప

కర్తవ్యం నిర్వహించు ,

పుస్తకాల మితృడివై 

అన్వేషణ పథమునెంచు 

ధ్యాన యోగ  కాంతిలోన 

యోగ్యత నువు సాధించు !


యువశక్తి లేలేరా 

జవసత్తువ నీదేరా 


అమ్మ నాన్న ఆనందమె 

సుఖ జీవిత అనుబంధం 

సత్య మార్గమే  గమ్యం ,

సేవ త్యాగమే  ధ్యేయం 

గంజాయిని పారద్రోలి 

బాధ్యత నిర్వర్తించు !


యువశక్తి లేలేరా 

జవసత్తువ నీదేరా 


బల హీనత లావరించె 

మాదక ద్రవ్యాలు వద్దు 

యువ లోకం నేతవై

యుగ ధర్మం బాటపట్టు 

ఆరోగ్యమె మహాబలం 

సద్బుద్దియే ప్రేరణం 


యువశక్తి లేలేరా 

జవసత్తువ నీదేరా

No comments