గురు రవిదాసు బోధలు విందాం - Sant Ravidas Songs in Telugu
రచన - అప్పాల ప్రసాద్
గురు రవిదాసు బోధలు విందాం
జీవితాలను మలచుకుందాం
గురు రవిదాసుకి జై జై
సంత్ శిరోమణి జై జై
సుఖం వచ్చినా పొంగిపోవద్దు
దుఃఖమొచ్చిన క్రుంగిపోవద్దు
పొగిడిన గాని గర్వించొద్దు
సమభావంతో ఉండమన్నడు
గురు రవిదాసుకి జై జై
సంత్ శిరోమణి జై జై
పనిని దైవంగ చూడమన్నడు
ఆత్మ వివేకం చేయమన్నడు
ప్రేమ, వినయము చూపమన్నడు
దైవ చింతనలో మునగమన్నడు
గురు రవిదాసుకి జై జై
సంత్ శిరోమణి జై జై
వేద ధర్మమే గొప్ప అన్నడు
దానగుణం పెంచమన్నడు
ఐశ్వర్యం - నశ్వరమన్నడు
భగవత్భక్తియే శాశ్వతమన్నడు
గురు రవిదాసుకి జై జై
సంత్ శిరోమణి జై జై
మానవులంతా సమానమన్నడు
భగవంతునికి సంతానమన్నడు
దైవ నామము స్మరించమన్నడు
ధర్మ రక్షణ చేయమన్నడు
గురు రవిదాసు బోధలు విందాం
జీవితాలను మలచుకుందాం
గురు రవిదాసుకి జై జై
సంత్ శిరోమణి జై జై
No comments