సంత్ శిరోమణి గురు రవిదాసు - Sant Ravidas Songs Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
సంత్ శిరోమణి గురు రవిదాసు
బోధనలే మనకానందం
భక్తిని కలిగి భజనలు చేస్తే
గురు రవిదాసుకు ఆనందం
లోకములోని మానవులంతా
భగవంతునికీ సంతానం
నా మనసంతా రామ నామమే
ఎలా మరువను నామస్మరణం
సంత్ శిరోమణి గురు రవిదాసు
బోధనలే మనకానందం
నీటికి ,చందనం తోడైతే
సుగంధాలనే వెదజల్లు
పరమాత్ముని కృప తోడుంటే
వైరాగ్యమంతట వ్యాపించు
వత్తికి ,దీపం తోడైతే
వెలుగులంతటా ప్రసరించు
భగవంతుని దయ వుంటేనే
జీవితమంతా ప్రకాశము
సంత్ శిరోమణి గురు రవిదాసు
బోధనలే మనకానందం
జననమెప్పుడు గొప్పకాదులే
మంచి కర్మతో మహాత్ముడగును
ఎక్కువ తక్కువ తేడా లేదు
సమానత్వమే భగవన్మయము
గొప్ప కులంలో పుట్టినంతనే
జ్ఞానులు కాలేరెవరైనా
ఆత్మ జ్ఞానం పొందినంతనే
పండితులౌదురు ఎవరైన
సంత్ శిరోమణి గురు రవిదాసు
బోధనలే మనకానందం
నిర్గుణతత్వం మదిలో తలచిన
విశ్వమంతటా బ్రహ్మమయం
మానవత్వము మదిలో నిలిపి
ఆచరించుటె మన ధర్మం
ఫలాపేక్షలు లేకుండ వుంటే
చేసిన కర్మలు ఉత్తమము
నిర్మలమైన మనస్సు వుంటే
నీలోనే భగవంతుడుండును
సంత్ శిరోమణి గురు రవిదాసు
బోధనలే మనకానందం
No comments