Breaking News

వీర భద్ర అంశ కలిగి - Veerabhadra Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్ 


వీర భద్ర అంశ కలిగి 

వీరముష్టులావేశం 

జేగంటల మోత మ్రోగె 

శంఖధ్వని మ్రోగెనదిగో 

తప్పేట వాద్యం చప్పుడు 

గిర గిర తిప్పే కర్ర సాము,కత్తి సాము

పెద్ద పెద్ద ప్రభలు గట్టి 

అలంకారమెంతొ జేసి 

ముందు వెనక విన్యాసం 

కణ కణమని డోలు మోగ

బూరలతో చెవుల ఊద 

సాంబ్రాణి ధూపంపట్టి 

వీర భద్ర ఖడ్గధారి 

వీరముష్టి ఘాతంతో 

ఒక్కసారి గెంతు గెంతె 

అగగగగ..అదదదద..అబబబబ 

శరభ శరభ అశ్శరభ శరభ 

శరభ శరభ అస్సరభ శరభ 


పదకొండవ శతాబ్దాన 

రాజమహేంద్రంలోన 

విష్ణువర్ధ పాలనలో 

వీరభద్ర సైనికులై 

వాణిజ్య సేవకులై 

శైవ సంప్రదాయకులై 

శివరాత్రి జాతరలో 

అపర శివారాధకులై 

వీర నాట్యమే జేసి 

అగ్నిగుండమే త్రోక్కి 

వీరదండకాలు చదివి 

పచ్చబొట్లు పొడిపించి 

విభూదియే ధరించి 

దేశ ధర్మ రక్షణలొ 

అగ్ర సేనులై కదిలే 

వీరభద్ర వీర ముష్టి 

దీక్షకులై కదలినారు

శరభ శరభ అశ్శరభ శరభ 

శరభ శరభ అస్సరభ శరభ 


శరభ, దశ్శరభ, అశ్శరభ, శరభ, శరభ

శరభ శరభ అస్సరభ శరభ...

దక్షుండు యజ్ఞంబు తలపెట్టనందులో..

బ్రహ్మదేవుని గుండె భగ్గుమనియె..

వింటిరా సురులార విన్నపం బొక్కటి..

కలగంటి ఈ రాత్రి కల్లగాను కల్లగానూ

మహిమీద పార్వతి -మాయమై పోయెనని 

పరమేశ్వరుని హోమము భగ్గుమ నియే 

చెమట బట్టగ తీసి -చట్రాతిపై వేసి 

శివుని జటాజూటమందుండి 

వీర భద్రుడే పుట్టె..దక్షుణ్ణి దండించె

వీరముష్టి ఆఘాతం -వీర భద్ర విన్యాసం 

అదదదద , అగగగగ , అదదదద , అగగగగ 

శరభ, దశ్శరభ, అశ్శరభ, శరభ, శరభ

శరభ శరభ అస్సరభ శరభ...

No comments