బుడిగే జంగం - Budigi Jangam Song Lyrics in Telugu
రచన – అప్పాల ప్రసాద్
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
నిలువుటంగి, పాగ సుట్టి
గజ్జెలందె ఘల్లుమనగ
చెంగు చెంగునా దూకి
వీరుల కథ విప్పి చెప్పె
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
తంబుర తీగలు మీటి
డక్కి డిక్కీ బుడిగెలతో
వింత వింత హాస్యమాడి
విలువలను వివరించే
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
సర్వాయి పాపన్న తెగువ
బాలనాగమ్మ పోరు
బొబ్బిలి యుద్ధం చూపి
వీరరసం రగిలించే
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
వీరశైవ తత్వాలను
గిర్ గిర్రున గిరికీలతో
పటపటయని పళ్ళు కొరికి
కీర్తనతో దరువులాడె
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
అడవులందు తిరిగి తిరిగి
ఔషధాలు సేకరించి
మూలానికి మందులిచ్చి
ఆరోగ్యం అందించే
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
చేతి సాముద్రికము
తాళపత్ర పంచాంగం
చిలుక జోష్యాలు చెప్పి
విశ్వమంతా సంచరించే
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
వీరరసం హాస్యరసం
కరుణరసం రౌద్రరసం
భయానకం భీభత్సం
అద్భుతాలు సృష్టించే
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
బేడ బుడగ జంగాలం
బుర్రకథలు వివరిస్తం
దేశభక్తి దైవభక్తి
నరనరాన వెలిగిస్తం
బుడిగే జంగాల వారము
ఊరూరా
సంస్కృతి బోధించె వారము
No comments