చిందు బాగోతమ్ములాట - Chindu Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
చిందు బాగోతమ్ములాట
ప్రాచీనం నాట్యశాస్త్రం
జీవితాలకు దారి చూపే
ఆదిదేవుని నృత్య గీతం
తెలుగు జాతికి గర్వం
అందరికి ఆదర్శం
జానపదం శాస్త్రీయం
సంస్కృతీ సంప్రదాయం
యక్షులనే గంధర్వులు
ఆడిపాడిన నేలరా
పల్లె ప్రజలకందుబాటై
విరాజిల్లే యక్షగానం
జీవితాలకు దారి చూపే
ఆది దేవుని నృత్య గీతం
పండితుల్ని పామరుల్ని
'శభాష్ 'అంటూ మెప్పించె
రెండువేల ఏళ్లనాటి
ప్రదర్శించే కళా రూపం
పట్టెడన్నం,పాత వస్త్రం
ఆశించిన జన వినోదం
కాలిగజ్జె ఘల్లుఘల్లున
చిందులేసే పౌరాణికం
జీవితాలకు దారి చూపే
ఆది దేవుని నృత్య గీతం
ధనము లేక దీనులైరి
సరస్వతికి పుత్రులైరి
భాగవతం కథలు ఎన్నో
అవలీలగ విప్పి చెప్పే
తన్మయత్వంలోన మునిగి
పాట,పద్యాలు పాడి
ప్రజానీకం మేలు కోరే
శ్రుతిలయల చిందు గానం
జీవితాలకు దారి చూపే
ఆది దేవుని నృత్య గీతం
మై రావణ,చెంచు లక్ష్మి
సారంగధర,అభిమన్యు
ఆది జాంబవ పురాణం
ఆడి పాడే నాటకాలు
ఆభరణం అలంకారం
నటనలేమో నయనపర్వం
తాళబద్దం చిందు నృత్యం
మంత్ర ముగ్దం హావభావం
జీవితాలకు దారి చూపే
ఆదిదేవుని నృత్య గీతం
సినిమ,టివి, వీడియోల
తాకిడికి శిథిలమయ్యే
అంతరించక ఆదరిస్తే
సంతరించును వైభవం
ఇంటిబయట వేడుకల్లో
వీధి వీధి జాతర్లలొ
ప్రజానీకం, ప్రభుత్వాలు
పోషిస్తేనే కాంతి మయం
జీవితాలకు దారి చూపే
ఆది దేవుని నృత్య గీతం
No comments