Breaking News

Telusukora Vidyarthi Song Lyrics in Telugu - తెలుసుకోర విద్యార్థి

Lyrics - Appala Prasad

తెలుసుకోర విద్యార్థి

మలుచుకోర జీవితాన్ని

నీ పరుగుల గమ్యమేమిటో 

నీ జన్మకు అర్థమేమిటో 


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని


జవ సత్వం నీ సొంతం -

విద్యార్జన ఆసాంతం 

దారి తప్పి నడవబోకురా -

వ్యసనాలకు లొంగబోకురా!


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని!!


ఇనుప కండరాల యువత 

ఉక్కు నరాలున్న వాడా 

మాదకద్రవ్యాల జోలి కెళ్ళకురా 

నిర్వీర్యం నిరాశలో క్రుంగకురా 


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని!!


నిన్ను నమ్ముకున్నదీ కుటుంబం 

నీవే ఈ దేశానికి భవితవ్యం 

మత్తులోన మునిగి పోబోకురా 

వృద్ధుడివై సత్తువ కోల్పోకురా 


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని!!


గుండె రగుల దేశభక్తి నీదిరా 

ప్రజాహితం కోసం కదలాలిరా 

మత్తులోన మునిగి నీవు 

గమ్మత్తుగ చిత్తు కాకు -లేలేరా


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని!!


దేవుడిచ్చిన నర జన్మం 

అంతుపట్టనిది ఈ మర్మం 

వృధా చేస్తివా నీ ఖర్మం 

తెలిసోస్తే అది బ్రహ్మాండం 


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని!!


మట్టి తడుపు యువ రక్తం నీవే 

దేశానికి నేత్రుత్వం నీవే 

తను మన ధనములనర్పించు 

నవ చరిత్రనే సృష్టించు..


తెలుసుకోర విద్యార్థి 

మలుచుకోర జీవితాన్ని

No comments