Bharatiya Yuvakuda Song Lyrics in Telugu - భారతీయ యువకుడా జెన్ జీ నవ యోధుడా
Lyrics : Appala Prasad
భారతీయ యువకుడా జెన్ జీ నవ యోధుడా
భావదాస్య ముక్తినొంది జాతిని నడిపించరా
ఈ మట్టిలొ జన్మనొంది,ఇచ్చోటనె గాలి పీల్చి,
ఈ భూమి నీళ్లు త్రాగి,పాడి పంటలనుభవించి,
ఈ జనులే చెల్లించిన -పన్నులతో పెరిగి తిరిగి,
కండబలం బుద్దిబలం ఆత్మ బలం మెండుగుండి,
దేశభక్తి గుండె నిల్పి- విశ్వమంత వికసితమై,
భుజం భుజం తట్టి నీవు-కదం కదం ముందుకేగి,
భారతీయ పౌరుడివై -ఋణబంధం తీర్పరా,
శక్తి పొంది, వినయమొంది,శరణాగతి చెందరా,
దేశమాత సుఖం కంటె -మించినదేముందిరా!
భారతీయ యువకుడా జెన్ జీ నవ యోధుడా
భావదాస్య ముక్తినొంది జాతిని నడిపించరా
రాజ్యాంగం చేతబట్టి, విలువలనే భంగపరచు
మువ్వన్నెలజెండవట్టి,సైనికులనె దెప్పి పొడుచు
విశ్రుంఖల స్వేచ్చనొంది, విధ్వంసం రచన చేయు
విదేశీయ భావజాల, విద్రోహుల ఉన్మాదం
రెచ్చగొట్టి ఉసిగొల్పి - విడగొట్టే కుతంత్రం
పరతంత్రం ఎత్తుగడలు జన్మభూమికవమానం
తలకెక్కిన వ్యసనం ఇది ప్రజాస్వామ్యహననం
రాజకీయ స్వార్థం ఇది బాధ్యత మరచిన వైనం
పదవుల మోహం ఇది కీర్తికాంక్ష ధనదాహం
నిజంలేని మాట నమ్మి, దారి తప్పబోకురా
భారతీయ యువకుడా జెన్ జీ నవ యోధుడా
భావదాస్య ముక్తినొంది జాతిని నడిపించరా
ఉపనిషద్ విజ్ఞానం -ఇతిహాసం నీతి పథం
ఛత్రపతి సామ్రాజ్యం - యోధ రాణా రణతంత్రం
బకించంద్ర మాతృభక్తి -రవీంద్రుని జాతీయత
నేతాజీ జై హిందు - భగత్ సింగ్ బలిదానం
కలాం యొక్క సాంకేతికత,నరేంద్రుని వేదాంతం
పూర్వీకుల అనుభవాలె యువతరానికాదర్శం
ప్రాంత భాష కుల వాదం -ఉచ్చులోన చిక్కుకోక
దేశమంత ఏకాత్మత - భావాలను వెదజల్లర
భారతీయ యువకుడా జెన్ జీ నవ యోధుడా
భావదాస్య ముక్తినొంది జాతిని నడిపించరా
No comments