Breaking News

ధర్మ ప్రతిష్టాపనకై ఉద్భవించే రవిదాసు - Sant Ravidas Song Lyrics in Telugu


రచన - అప్పాల ప్రసాద్

ధర్మ ప్రతిష్టాపనకై - ఉద్భవించే రవిదాసు 

లోకానికి చైతన్యం - స్ఫూర్తినింపే రవిదాసు 


సుల్తానుల మతాన్ధత-వినాశనం జరుగు వేళ 

పదునాల్గవ శతాబ్దంలో -అవతరించె రవిదాసు 

అన్యాయం, అణిచివేత - కొనసాగే క్రమంలో 

మానవతాదీపాలను వెలిగించే రవిదాసు 


ధర్మ ప్రతిష్టాపనకై - ఉద్భవించే రవిదాసు 

లోకానికి చైతన్యం - స్ఫూర్తినింపే రవిదాసు 


కుంచితమౌ కులవాదం - వివక్షత ననుభవించి

ఆధ్యాత్మిక జ్ఞానంలో - ఇంతింతై వటుడింతై 

ఆకాశాన్నాక్రమించే - భక్త యోగి రవిదాసు 

సత్సంగంబోధతో అందరినీ ఆదరించే రవిదాసు 


ధర్మ ప్రతిష్టాపనకై - ఉద్భవించే రవిదాసు 

లోకమంత చైతన్యం స్ఫూర్తినింపే రవిదాసు 


వారణాసి సమీపాన -గోవర్ధన పురంలోన 

మాఘమాస పూర్ణిమలో - జన్మించెను రవిదాసు 

సాద సీద కుటుంబం - సాధనేమో అపూర్వం 

భక్తి సేవ మార్గంలో - వెలుగు పంచె రవిదాసు


ధర్మ ప్రతిష్టాపనకై - ఉద్భవించె రవిదాసు 

లోకానికి చైతన్యం - స్ఫూర్తినింపె రవిదాసు 


భక్త మీరా,ఝాలాబాయి- వారణాసి రాజులంత 

సత్సంగం చెంతచేరి -  ఆధ్యాత్మిక బాట పట్టె 

పాద రక్షలు చేస్తూనే - బోధ చేసెను రవిదాసు 

భగవంతుని భజిస్తూనే -రవిదాసుకి మోక్షమొచ్చే 


ధర్మ ప్రతిష్టాపనకై - ఉద్భవించే రవిదాసు 

లోకమంత చైతన్యం -స్ఫూర్తి నింపే రవిదాసు

No comments