Breaking News

సుజ్ఞానయోధుడ లేవరా - Sugnana Yodhuda Levara Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


సుజ్ఞానయోధుడ - లేవరా 

విజ్ఞానఖనియై కదలరా

వాస్తవాలను మరుగుపరిచిన 

చరిత కథలను తెలియరా 


ఆంగ్ల మానస భావదాస్యం 

మట్టుబెట్టర సోదరా 

భారతీయుల నిజ చరిత్రను 

తెరిచి చూపర సోదరా 


సుజ్ఞానయోధుడ - లేవరా 

విజ్ఞానఖనియై కదలరా 



ఆంగ్లభాషా వ్యామోహం 

సంస్కృతీ మూలాల చెరిపెను 

బానిసత్వ బ్రతుకు కోసం 

తెలుగు భాషను వమ్ముచేసెను 


సుజ్ఞానయోధుడ లేవరా 

విజ్ఞానఖనియై కదలరా



వ్యక్తిత్వం నిల్పుకుంటూ 

మనో బలమును పెంచుకోర 

ఎగుడు దిగుల్లెన్నివున్నా 

సత్య శిఖరం చేరరా 


 సుజ్ఞానయోధుడ - లేవరా 

విజ్ఞానఖనియై కదలరా


అసమర్థత,విద్వేషం 

అలసత్వం,అజ్ఞానం

అల్పత్వం ,అహంభావ

అవగుణాలను పారద్రోలు 


సుజ్ఞానయోధుడ - లేవరా 

విజ్ఞానఖనియై కదలరా



వేల ఏళ్ల భారతీయ 

ఘన చరిత్రను మాయచేసి 

విభజించి పాలించే 

విష వలయం చేదించు 


సుజ్ఞానయోధుడ - లేవరా  

విజ్ఞానఖనియై కదలరా


ఆత్మ న్యూనత భావము 

అడుగడుగున అంటగట్టి 

స్వాభిమానం దెబ్బగొట్టె 

కుతంత్రాలను కూలద్రోయ్ 


సుజ్ఞానయోధుడ - లేవరా 

విజ్ఞానఖనియై కదలరా


No comments