Breaking News

రవిదాసా జై జై గురుదేవా - Sant Ravidas Songs Lyrics in Telugu

 రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా


1. చెప్పులు కుట్టుచు హరిని జపించె 

పరమభక్తుడవు - గురుదేవా॥

చిరునవ్వులతో - సేవలు జేసే 

రాజయోగివి గురుదేవా 


రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా


2. పరసు రాయిని వద్దన్నావు

బంగరు కడియం సృష్టించావు 

"హరినామం - మహా ధనమని

లోకానికి నువు బోధించావు ॥


రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా


 3. "మన్ చంగా తో కఠౌతీ మే గంగా"

జీవితానికి అమృతవాక్యం 

అంతరంగము శుద్ధిగ వుంటే 

గంగానది మన చెంతన ఉండు


రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా


4. నిర్మలమైన మనస్సు ఉంటే 

ఆడంబరమౌ కర్మలేలరా 

కుల భేదాలు తొలగించి 

భక్తి ప్రేమలే కలిగుండు 


రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా 


5. సగుణమ్మైనా - నిర్గుణమైనా 

భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే 

ఆది దేవుడు నీలో ఉండు 

కర్మలు చేస్తే తోడై వుండు


రవిదాసా ...జై జై గురుదేవా 

సంత్ శిరోమణి జై జై గురుదేవా

No comments