Breaking News

భక్తి ముక్తి దాయకం నిత్య సత్య ప్రేరకం - Sant Ravidas Telugu Songs

రచన - అప్పాల ప్రసాద్

భక్తి ముక్తి దాయకం - నిత్య సత్య ప్రేరకం 

సంత్ శిరోమణి మాట- రవిదాసు గురు బాట 


వనములందు తిరిగి తిరిగి వెతుకుటెందుకు?

సర్వ వ్యాపి శ్రీ రాముని తెలియవెందుకు?

నీ మదిలో నీ లోపల తొంగి చూడరా

ధ్యానమందు ఆ కాంతిని దర్శించుమురా


భక్తి ముక్తి దాయకం - నిత్య సత్య ప్రేరకం 

సంత్ శిరోమణి మాట- రవిదాసు గురు బాట 


సంసార సాగరాన్ని - అవలీలగ దాటించె 

గురు రామానందుడే - రైదాసుకు తోడుండె

అనాథ నాథ గోవింద - ఆపత్బాంధవ అంటే

పరుగు పరుగున వచ్చి- పరమాత్మ కాపాడును 


భక్తి ముక్తి దాయకం - నిత్య సత్య ప్రేరకం 

సంత్ శిరోమణి మాట- రవిదాసు గురు బాట 


జ్ఞాన మార్గమనుసరించి దీపం వెలిగించరా

కర్మ బంధనాలు త్రెంచి - భక్తిని ప్రకటించరా 

పరమాత్ముని కీర్తించి అన్వేషణ చేయరా 

ఎవరు నిన్ను సృష్టించిరో నీలో తానుండెరా


భక్తి ముక్తి దాయకం - నిత్య సత్య ప్రేరకం 

సంత్ శిరోమణి మాట- రవిదాసు గురు బాట 


గిరులందున తరులందున ఉరుకు పరుగులేలరా

పొట్ట నింపి,పడి వుంటే జన్మ కర్థమేమిరా 

హృదయ కమలమందున్న జ్యోతిని పరికించరా 

నిత్య సాధనలు చేస్తూ దైవం దర్శించరా 


భక్తి ముక్తి దాయకం - నిత్య సత్య ప్రేరకం 

సంత్ శిరోమణి మాట- రవిదాసు గురు బాట

No comments