సంత్ శిరోమణి రవిదాసు - Sant Ravidas Telugu Song Lyrics
రచన - అప్పాల ప్రసాద్
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
సమరస మూర్తి రవిదాసు
ప్రేమస్వరూపి రవిదాసు
రామానందుని శిష్యకోటిలో
వినయవంతుడు రవిదాసు
గురుపరంపర, గురు సందేశం
వ్యాప్తి చేసెను రవిదాసు
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
మానవత్వం సమానత్వం
మదిలో నింపిన రవిదాసు
దురాచారము తొలగించి
భక్తిని చాటిన రవిదాసు
పదమూడొందల డెబ్భైఏడు
పవిత్ర కాశీ క్షేత్రమందున
మాఘ పూర్ణిమ రవివారం
అవతరించేను రవిదాసు
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
తల్లి దండ్రులను సేవించె
లోనాదేవిని వివాహమాడె
సంత్ కబీరుకు సమకాలికుడై
భక్తి ఉద్యమం నడిపించే
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
దేవదేవుని నామ జపంతో
పాదరక్షలు తయారుచేసే
సాధుసంతులను సేవించి
సార్థకుడయ్యె రవిదాసు
పవిత్రమదితో నీటిపాత్రలో
కంకణం తీసె రవిదాసు
సంపదనిచ్చే పరుసవేదిని
తిరస్కరించెను రవిదాసు
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
పదిహేనొందల ఎనభై నాల్గు
చిత్తోడు రాజ్యమునందు
మీరా ,రాణి ఝాలీ బాయి
శిష్యుల చేరెను రవిదాసు
పుట్టుకతోనే 'గొప్ప' కాదనే
సదాచారమే 'సన్మార్గమ'నే
ధ్యానం,ప్రాణాయామం ద్వారా
మోక్షం పొందెను రవిదాసు
సంత్ శిరోమణి రవిదాసు
భగవత్భక్తుడు రవిదాసు
No comments