Breaking News

మానవసేవయే మాధవసేవని - Sant Ravidas Songs Telugu

రచన - అప్పాల ప్రసాద్

మానవసేవయే మాధవసేవని  

మార్గం చూపిన మహితాత్మా!

కర్మయోగివై ప్రేమను పంచిన 

ధర్మ మూర్తివి రైదాసా


1. నీ జీవనమే నిరాడంబరం  - 

సత్యసాధనే నీ సన్మార్గం

జననమెన్నటికీ గొప్పకాదని –

కర్మ చేస్తే గౌరవముందని,

పాదరక్షల తయారి వృత్తిలో 

ప్రతిభను చాటి, పరిశ్రమించి 


మానవసేవయే మాధవసేవని  

మార్గం చూపిన మహితాత్మా!


2. కులాల గోడలు కూల్చేసి- 

ప్రేమామృతమును కురిపించి

సమతా భావం పెంపొందించి 

భక్తి ఉద్యమం నడిపించి 

పని చేస్తూనే  శ్రీహరి నామం 

జపించినావు రవిదాసా 


మానవసేవయే మాధవసేవని  

మార్గం చూపిన మహితాత్మా!


3. రాజు,రాణులు ఎవరైనా- 

కుల వర్గాలు ఎన్నున్నా

సత్ సాంగత్యం సాగించి -

ధర్మ బోధనం గావించి

ఆత్మ జ్యోతిని వెలిగించే 

సమరసమూర్తివి రైదాసా


మానవసేవయే మాధవసేవని  

మార్గం చూపిన మహితాత్మా 

No comments