Breaking News

సమతా సూర్యుడా ఓ రైదాసా - Sant Ravidas Songs Telugu Lyrics

రచన - అప్పాల ప్రసాద్

సమతా సూర్యుడా - ఓ రైదాసా

బేగంపురా సృష్టికర్త - ఓ రవిదాసా 


ఆకలి దప్పులు లేని - 

ఆనంద నిలయం !

కష్టం నష్టం తెలియని 

సుఖమయ ధామం 

అజ్ఞాన చీకటి బాపు 

కాంతి కిరణ సదనం 

అసమానత లేదిచ్చట 

అందరికీ సమన్యాయం

సత్యజ్ఞాన వెలుగుల్లో

ఈ పురమే సురక్షితం 

నీవు కన్న కల నిజమై - 

తేజిల్లే  బేగంపురం i


సమతా సూర్యుడా ఓ రైదాసా

బేగంపుర సృష్టి కర్త - ఓ రవిదాసా 


ప్రాంత భాష కులభేదం -

సమూలంగా తొలగించి

కారుణ్య దీపంతో -

కాంతిని నువు వెలిగించి 

సత్యమార్గమే చూపి

సత్కర్మలు చేయనెంచి 

బోధ చేసి - బాధ బాపి 

బేగంపుర - సృష్టి చేసి 


సమతా సూర్యుడా ఓ రైదాసా

బేగంపుర సృష్టికర్త ఓ రవిదాసా 


ధనిక పేద జనులంతా

తరతమ భేదాలు మరిచి 

చేరిరి నీ సన్నిధి

పొందిరి నీ జ్ఞానశక్తి  

విశ్వం నలు దిక్కులలో 

నీ గుడులే వెలిసేను 

గురుగ్రంథ సాహెబ్ లో 

నీ వాణియే వినిపించెను 


సమతా సూర్యుడా ఓ రైదాసా

బేగంపుర సృష్టికర్త - ఓ రవిదాసా

No comments